టెక్స్ట్ మెసేజ్ కి 27 ఏళ్ళు!

టెక్స్ట్ మెసేజ్ కి 27 ఏళ్ళు!
x
Representational Image
Highlights

తొలిసారి టెక్స్ట్ మెసేజ్ పంపించి నేటికి (3 డిసెంబర్) 27 సంవత్సరాలు!

వెళ్ళగానే ఉత్తరం రాయరా.. అప్పటితరం వీడ్కోలు మాట!

రైలు దిగగానే ఫోన్ చేయరా.. తరువాతి తరం సూచన!

ఒరేయ్..ఇంటికి వెళ్ళిన వెంటనే మెసేజ్ ఇవ్వు.. మొన్నటి తరం ముచ్చట!

వాట్సప్ చేయరా ఇప్పటి తరం సూచన!

తెల్లవారిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ టెక్స్ట్ మేసేజిలతో కాలం గడిపేసే కుర్రకారెందరో. వాట్సప్ గ్రూపుల్లో మేసేజిలతోనే తమ కొలీగ్స్ తో పని నడిపించేసేవారెందరో.

దూరాల్ని కలిపే సన్నని దారాలు అని అప్పట్లో ఉత్తరాలని అనుకునే వారు. ఇప్పడు చిన్న సందేశం చాలు మనిద్దర్నీ కలిపి ఉంచడానికి అంటున్నారు.

ఇప్పుడు ఇదంతా ఎందుకంటే, ఈరోజు(3 డిసెంబర్) మొట్టమొదటి మెసేజ్ పంపించుకున్న రోజు. సరిగ్గా 27 ఏళ్ల క్రితం 1992వ సంవ‌త్స‌రం డిసెంబర్ 3వ తేదీన మొదటి టెక్ట్ మెసేజ్‌ను పంపారు. వొడాఫోన్ సంస్థ‌కు చెందిన ఇంగ్లాండ్ డైరెక్టర్ రిచర్డ్‌కు.. ఇంజనీర్ నెయిల్ పాప్‌వర్త్ మొట్టమొదటి టెక్ట్స్ మెసేజ్ పంపాడు. ఇదే మొట్ట మొదటి టెక్స్ట్ మెసేజ్.

నెయిల్ పాప్‌వర్త్.. 'మెర్రీ క్రిస్టమస్' అనే విషెష్ మెసేజ్‌ను తొలిసారిగా త‌న పై అధికారికి పంపించారు. అయితే.. పాప్‌వర్త్ ఆ మెసేజ్ పంపిన‌ సమయంలో

సెల్‌ ఫోన్లకు ఇంకా కీబోర్డులు లేవు. పాప్‌వర్త్.. ఆ మేసేజ్‌ని కంప్యూటర్‌లో టైప్ చేసి మొబైల్ ద్వారా ఆ సందేశాన్ని పంపించారు.

అయితే పాప్‌వ‌ర్త్.. ఆ మెసేజ్ పంపినప్పుడు రిచర్డ్ క్రిస్టమస్ పార్టీలో ఉన్నారంట‌. పార్టీ అనంత‌రం తనకు అందిన మెసేజ్ ను చూసుకొని చాలా ఆశ్చర్యానికి గురయ్యాడట. ఆ త‌ర్వాత‌ మొద‌టి మెసేజ్ ను అందుకున్న రిచర్డ్.. త‌న‌ అనుభూతుల్ని మీడియాతో పంచుకున్నాడు.

ఇప్పుడు వాట్సప్, టెలిగ్రాం వంటి ఆధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాకా..మెసేజ్ అంటే చాలా సులువుగా అనిపిస్తోంది. అదేవిధంగా పెద్దగా దానికి విలువ కూడా ఇవ్వట్లేదు. కానీ, ఇరవై ఎల్లా క్రితం టెక్స్ట్ మెసేజ్ అంటే విపరీతమైన ప్రాధాన్యం ఉండేది. ఏదిఏమైనా మెసేజ్ తో దూరాల్ని సన్నిహితం చేసిన సంఘటన చేసిన మేలు మరిచిపోలేనిది కదూ!

Show Full Article
Print Article
More On
Next Story
More Stories