జొమాటో యాప్ కు ఆర్డర్ల మోత : నిన్న రాత్రి నిమిషానికి 4100 ఆర్డర్లు

జొమాటో యాప్ కు ఆర్డర్ల మోత : నిన్న రాత్రి నిమిషానికి 4100 ఆర్డర్లు
x
Highlights

* ఔట్ డోర్ పార్టీలకు చెక్ చెప్పడంతో ఇంటి పట్టునే జనం * ఇంట్లో పార్టీలతో మజా చేసుకున్న జనం * ఫుడ్ డెలివరీ యాప్స్ కు ఒక్కసారిగా పెరిగిన డిమాండ్

కరోనా కబాడీ ఆడేసినా మన వాళ్లలో జోష్ ఏమాత్రం తగ్గలేదు గతం గత‌ అనుకుంటూ కొత్త ఏడాది వేడుక పేరుతో మస్త్ మజా చేసుకున్నారు. బయటికొస్తే ఖబడ్దార్ అని పోలీసుల వార్నింగ్ లిస్తే అయితే ఓకే అంటూ ఇంటి పట్టునే ఉంటూ కుమ్మేశారు తాగుడు, తినుడులో మనోళ్లు రికార్డులు తిరగరాశారు కొత్త ఏడాది వేడుకలను జనం ఇంటి పట్టునే చేసుకున్నా ఫుడ్ డెలివరీ యాప్స్ కి మాత్రం పండగ చేసేశారు ఎంతలా అంటే యాప్స్ ఉక్కిరి బిక్కిరి అయిపోయేలా గురువారం సాయంత్రం నుంచే ఫుడ్ ఆర్డర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఫుడ్ డెలివరీ యాప్ జుమాటోకు నిన్న రాత్రి ఏకంగా నిమిషానికి 4,100 ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఇప్పటి వరకూ నిమిషానికి 2,500 ఆర్డర్లే రికార్డు కాగా నిన్న సాయంత్రం ఈ రికార్డ్ బ్రేక్ అయింది. రాత్రి 8 గంటల సమయానికి నిమిషానికి4,100 ఆర్డర్లు బుక్ అయినట్లు జొమాటో సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా అనేక చోట్ల బహిరంగ వేడుకలపై ఆంక్షలు విధించడంతో జనం ఇంటినుంచే ఆర్డర్లు పెట్టేశారు. ఇందులో ఎక్కువగా పిజ్జాలు, బిర్యానీలే ఎక్కువగా బుక్ అయ్యాయి.

కరోనా లాక్ డౌన్ తో జనం ఇంటి పట్టున ఉన్నన్నాళ్లూ పుడ్ యాప్స్ బుకింగులు లేక నీరసించినా నిన్న ఒక్క రోజు కరువు తీరిపోయేలా జనం బుక్ చేసేశారు. 2021 న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పేరుతో ఫుల్లుగా తాగి తాగి తూలారు మటన్, చికెన్ అంటూ పీకలదాకా లాగించి బ్రేవ్ మన్నారు.

ఇక ఫుడ్ యాప్ ల సంగతి అలా వుంచితే నిన్న తెలంగాణ వ్యాప్తంగా మద్యం ఏరులై పారింది. నిన్నొక్క రోజు కాదు గత నాలుగు రోజులుగా మద్యం అమ్మకాలు రికార్డులు దాటాయి. దాదాపు రూ. 759కోట్లు విలువైన మద్యం అమ్ముడైందని అబ్కారీ లెక్కలు చెబుతున్నాయి. గతేడాదితో పోలిస్తే దాదాపురూ.200 కోట్లు అదనంగా ఆదాయం వచ్చిందని అబ్కారీ శాఖ చెబుతోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బహిరంగ వేడుకలకు అనుమతించకపోయినా మద్యం అమ్మకాలు మాత్రం తగ్గలేదు.

ఈ ఏడాది పార్టీలకు అనుమతించని పోలీసులు ప్రమాదాల నివారణకు విస్తృత డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లో బేగంపేట్‌ ఫ్లైఓవర్‌ మినహా తెలుగుతల్లి, బషీర్‌భాగ్‌, నారాయణగూడ, పంజాగుట్ట ఫ్లైఓవర్‌లను మూసివేశారు. ట్యాంక్‌బండ్‌, నెక్లెస్‌ రోడ్డు, దుర్గం చెరువు తీగల వంతెనపైకి రాత్రి వాహనాలను అనుమతించలేదు. అయినా జనం ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories