పాపం పండింది.. జహీరాబాద్ రేపిస్ట్ విధి చేతి నుంచి తప్పిచుకోలేకపోయాడు

పాపం పండింది..  జహీరాబాద్ రేపిస్ట్ విధి చేతి నుంచి తప్పిచుకోలేకపోయాడు
x
Highlights

చేసింది క్షమించరాని తప్పు, పైగా పోలీసుల నుంచి తప్పించుకోవాలనుకున్నాడు కానీ, విధి వదల్లేదు చివరికి, కారు బోల్తాపడి మరణించాడు సంగారెడ్డి జిల్లా...

చేసింది క్షమించరాని తప్పు, పైగా పోలీసుల నుంచి తప్పించుకోవాలనుకున్నాడు కానీ, విధి వదల్లేదు చివరికి, కారు బోల్తాపడి మరణించాడు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రేప్‌ కేసులో నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతూ మృత్యువాత పడ్డాడు.

మహిళపై అత్యాచారం కేసులో ఇద్దరు నిందితులను సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, మరో నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుని కారులో పారిపోతూ ప్రమాదానికి గురై మరణించాడు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో అతివేగంతో కారును నడపడటంతో రాయికోడ్ మండలం సిరూర్ సమీపంలో కారు బోల్తాపడి నిందితుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

మహిళలే లక్ష్యంగా ఐదుగురు సభ్యుల ముఠా దోపిడీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలోని ముగ్గురు నిందితులే పోలీసుల పేరుతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పస్తాపూర్‌లో మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. నీ లగేజీలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు ఉన్నాయంటూ మహిళను బస్సులో నుంచి కిందకి దించిన నిందితులు ఆ తర్వాత సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే, బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న జహీరాబాద్‌ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు నిందితులను గుర్తించి పట్టుకున్నారు. అయితే, మూడో నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోతూ కారు బోల్తాపడి మరణించాడు.

అయితే, బాధితురాలి తీరుపైనా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులమని చెప్పగానే బస్సు దిగిపోవడం, రమ్మన్న చోటకి వెళ్లడంతో బాధిత మహిళ నేపథ్యాన్ని కూడా సేకరిస్తున్నారు. గుట్కాను అక్రమ రవాణా చేస్తున్న మహిళకు నిందితులతో ఇంతకుముందే సంబంధాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories