YS Sharmila: చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించిన షర్మిల

YS Sharmila: కేసీఆర్ పాలనపై మండిపడ్డ వైఎస్ఆర్ టీపీ అధినేత

Sandeep Eggoju
Published on: 20 Oct 2021 3:53 PM IST
YS Sharmila Started Padayatra From Chevella
X
చేవెళ్ల నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన వైస్ షర్మిల (ఫైల్ ఇమేజ్)

YS Sharmila: తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి కుటుంబ సంక్షేమాన్ని చూసి మురిసిపోతున్న కేసీఆర్ పాలనకు చరమగీతం పలికేలా తన ప్రజా ప్రస్థాన యాత్ర సాగుతుందని వైఎస్ఆర్ టీపీ అధినేత షర్మిల తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. కులమతాల మాటున ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ పార్టీని గంగలో కలిపేందుకే తను పాదయాత్ర ప్రారంభించినట్లు వెల్లడించారు. అంతేకాక నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమవుతున్న కేసీఆర్ పాలనకు స్వస్తి చెప్పాలని పిలుపునిచ్చారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story