YS Sharmila: ఇవాళ షర్మిల పాదయాత్ర మళ్లీ ప్రారంభం

YS Sharmila Padayatra Will Start Again Today
x

YS Sharmila: ఇవాళ షర్మిల పాదయాత్ర మళ్లీ ప్రారంభం

Highlights

YS Sharmila: ఆగిన చోటునుంచే ప్రారంభించాలని పార్టీ శ్రేణుల ఏర్పాట్లు

YS Sharmila: వైఎస్ఆర్ తెలంగాణపార్టీ అధ్యక్షురాలు షర్మిల ఇవాళ మళ్లీ ప్రజాప్రస్థాన పాదయాత్రను ప్రారంభించనున్నారు. హైకోర్టు షరతులతో ఈ యాత్ర కొనసాగించే విధంగా షర్మిల అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నర్సంపేటలో సోమవారం ఉద్రిక్తల నడుమ పాదయాత్రకు ఆటంకం కలిగింది. టీఆర్ఎస్ కార్యకర్తల ఆగ్రహించి పాదయాత్రను అడ్డుకోవడం, షర్మిల బస్సును తగులబెట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో షర్మిల హైదరాబాద్‌ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటున్న ప్రగతి భవన్ ఎదుట ఆందోళనకు దిగాలనుకున్న ప్రయత్నం బెడిసికొట్టినా... తెలంగాణ రాజకీయాల్లో షర్మిల ప్రస్థానం ప్రకంపనలు సృష్టించాయి.

షర్మిల పాదయాత్రను నర్సంపేట పోలీసులు రద్దుచేశారు. దీంతో పాదయాత్ర ఇక కొనసాగడం కష్టమేననుకున్నారు. వైఎస్ఆర్ తెలంగాణపార్టీ అధ్యక్షురాలు షర్మిల తరఫున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించడంతో షరతులతో కూడిన అనుమతి లభించింది. ఎవ్వరినీ రెచ్చగొట్టకుండా, విద్వేషాలకు కారణగాకుండా పాదయాత్రను చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది.

తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ఉద్రిక్తత రేపిన వైఎస్. షర్మిల పాదయాత్రలో అరెస్టు ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర యధావిధిగా ఇవాళ ప్రారంభం కానుంది. అపిన చోట నుంచే పాదయాత్ర తిరిగి ప్రారంభించనున్నారు. నిన్న ముఖ్య నాయకులతో భేటీ తర్వాత మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అయితే.. నర్సంపేటలో తమ వాహనాలపై దాడి చేసిన ఘటనకు నిరసనగా వైఎస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నించారు. ధ్వంసమైన కారులోనే నిరసన తెలిపేందుకు బయల్దేరారు. పోలీసులు ఆమె కారును అడ్డుకొని.. ఆమె దిగకపోవడంతో కారుతో సహా క్రేన్ సహాయంతో బలవంతంగా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. నాంపల్లికోర్టు షర్మిల కు బెయిల్ మంజూరు అయింది. దీంతోపాటు ఆమె పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి రావడంతో షర్మిల రాజకీయ శిబిరంలో ఉత్సాహం రెట్టింపైంది.

హైకోర్టు అనుమతితో షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రను కొనసాగించనుంది. నర్సంపేట నుంచి మొదలై... మహబూబబాద్ వరకు గురువారం పాదయాత్ర జరగనుంది. అయితే సోమవారం నర్సంపేటలో జరిగిన ఘటన లో షర్మిల కార్ వాన్ కాలిపోయింది. ఆ కార్ వాన్ లోనే పాదయాత్ర సమయంలో షర్మిల ప్రయాణం చేయడం, రెస్ట్ తీసుకోవడం లాంటివి చేస్తుంటారు. దానితో పాటు పాదయాత్ర దారిలో ఉంచిన ఫ్లెక్సీలను చింపి వేశారు. మరికొన్నింటిని తగుల బెట్టారు. వీటన్నింటినీ మళ్ళీ తయారు చేసి పెడుతున్నారు. కారవాన్‌కు ప్రత్యామ్నాయంగా మరో కొత్త బస్ ను పాదయాత్ర కోసం తీసుకున్నారు.

ఇవాళ ఉదయం 10 గంటలకు తెలంగాణ గవర్నర్ తమిళిసైని భేటీ అయ్యేందుకు అపాయింట్ మెంట్ తీసుకున్నారు. పాదయాత్రలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల దాడులకు సబంధించి ఫిర్యాదు చేయనున్నారు. గవర్నర్ తమిళిసై భేటీ అనంతరం ప్రజా ప్రస్థానం పాదయాత్రకు బయలుదేరుతారని సమాచారం. ఇప్పటికే 3500 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన షర్మిల మరో 250 కిలోమీటర్ల అనంతరం వరంగల్ భారీ బహిరంగ సభ తర్వాత పాదయాత్రకు విరామమిస్తారు. అయితే ముందుగా అనుకున్నట్లుగా డిసెంబర్ ఏడు న బహిరంగ సభ కాకుండా డిసెంబర్ 10 న బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories