సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

YS Sharmila meets CM Revanth Reddy
x

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

Highlights

YS Sharmila: కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు.

YS Sharmila: కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. ఈ నెల 8న వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమానికి హాజరు కావాలని ఆమె ఆహ్వానించారు. ఈ సందర్భంగా షర్మిలకు సీఎం శాలువా కప్పి సత్కరించారు. పుష్పగుచ్ఛం అందించారు.

షర్మిల ఆ తర్వాత, ప్రజాభవన్‌లో తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను కలిశారు. ఆయనను కూడా జయంతి కార్యక్రమానికి ఆహ్వానించారు. జులై 8న విజయవాడలో వైఎస్సార్ 75వ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు షర్మిల తెలిపారు. ఈ వేడుకలకు ఆమె పలువురు తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఆహ్వానిస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కూడా షర్మిల ఆహ్వానించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories