తెలంగాణలో రాజకీయ శక్తిగా ఎదిగిన వైఎస్ షర్మిల

YS Sharmila has Become a Political Force in Telangana
x

తెలంగాణలో రాజకీయ శక్తిగా ఎదిగిన వైఎస్ షర్మిల  

Highlights

YS Sharmila: ముఖ్యమంత్రి రేసులో 3వ స్థానంలో నిలిచిన షర్మిల

YS Sharmila: వైఎస్ షర్మిల..YSRTP అధ్యక్షురాలు..దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్‎రెడ్డి కూతురు.. ఇటీవలే పార్టీ స్థాపించిన షర్మిల రాజీకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ కోడలిగా ఈ ప్రాంత ప్రజల పక్షాన నిలబడతానంటూ ముందుకు వచ్చారు. ఏకంగా 3వేల 5 వందల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. మరి షర్మిలను తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారా..? ఈ ప్రాంతంలో అసలు ఆమెను గుర్తిస్తున్నారా..? అంటే ఓ సంస్థ చేపట్టిన సర్వేలో ప్రజలు పట్టం కడుతున్నారని తేలిందని YSRTP వర్గాలు వెల్లడించాయి.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తనదైన ముద్రవేశారు వైఎస్. రాజశేశర్‎రెడ్డి. సంక్షేమ పథకాలతో పేదల మనిషిగా ముద్రవేసుకున్నారు. రెండు సార్లు సీఎంగా విజయం సాధించిన వైఎస్ ఆ తర్వాత హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. భౌతికంగా వైఎస్ లేకపోయినా..ఆయనంటే అభిమానించేవాళ్లు ఇప్పటికీ ఉన్నారని మార్కెట్ రీసెర్చ్ అండ్ సోషల్ డెవలప్మెంట్ సర్వే ఆఫ్ తెలంగాణ -CMSD సంస్థ వెల్లడించింది. ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇప్పటికీ 46 శాతం మంది ప్రజలు గుర్తుచేసుకుంటున్నారని వివరించింది. ఇప్పుడు వైఎస్ రాజకీయ వారసురాలిగా షర్మిల తెలంగాణ పాలిటిక్స్‎లో తనదైన ముద్ర వేస్తున్నారని CMSD సంస్థ తెలిపింది.YSRTP స్థాపించిన రెండేళ్లలోనే షర్మిలకు తెలంగాణలో షర్మిలకు జనం మద్దతు అనూహ్యంగా వస్తోందని తమ సర్వేలో తేలినట్లు ప్రకటించింది. రాష్ట్రంలో 12 శాతం మంది ప్రజలు షర్మిలకు మద్దతు తెలుపుతున్నారని..ఆమెను ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని CMSD తెలిపింది. తెలంగాణలో ఎవరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారో..వాళ్లలో షర్మిల మూడో ప్లేస్ లో నిలిచారని సర్వే సంస్థ వెల్లడించింది.

తెలంగాణ రాజకీయాల్లో షర్మిల ఒక శక్తిగా ఎదుగుతున్నారని..అతి తక్కువ వ్యవధిలో ఈస్థాయి గుర్తింపు సామాన్యమైనది కాదని cmsd సంస్థ తెలిపింది. 3వేల 5వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన షర్మిల కాళేశ్వరం అక్రమాలను ఎండగట్టడంలో సఫలమయ్యారని తమ సర్వేలో తేలిందని వివరించింది. అలాగే కేసీఆర్‎కు నిజమైన ప్రత్యర్ది, ప్రత్యామ్నాయంగా షర్మిలను గుర్తించారని చెప్పింది. డిసెంబర్ 2022 నెలలో నిర్వహించిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ముఖ్యమంత్రిగా మూడోస్థానం కట్టబెట్టారని cmsd సర్వే సంస్థ చెప్పింది. తెలంగాణలోని 60 నియోజకవర్గాల్లో సర్వే నిర్వహించగా..దక్షిణ తెలంగాణలో అత్యధికంగా జనం మద్దతు పలికారు. ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ, మెదక్, మహబూబ్ నగర్‎లో షర్మిలకు సపోర్ట్ అధికంగా ఉంది. పాలేరు, భద్రాచాలం, ఇల్లందు, ఖమ్మం, అచ్చంపేట, వనపర్తి తదితర అసెంబ్లీ నియోజకవర్గాల్లో అనూహ్యమైన మద్దతు లభించింది. డిసెంబర్ 2022లో అప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే YSRTPకి 20 శాతం ఓట్లు రావచ్చని సర్వే సంస్థ అభిప్రాయపడింది.

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో సగానికి పైగా షర్మిలను జనం వైఎస్సార్ వారసురాలిగా గుర్తించడం ఆసక్తికర పరిణామం అని సర్వే సంస్థ చెప్పింది. ఉత్తర తెలంగాణలో షర్మిల పాదయాత్ర అద్భుతమైన విజయం సాధించిందని వివరించింది. పెద్ద సంఖ్యలో జనం మద్దతు పలికారని..అధికార పార్టీ ఎమ్మెల్యేలను లక్ష్యంగా చేసుకొని ఘాటైన విమర్శలు గుప్పించడంలో ఆమె సక్సెస్ అయ్యారని వివరించింది. అధికార పక్షం అవినీతిని ఎండగట్టడం.. వాస్తవాలు, లెక్కలతో సహా వివరించడంపట్ల జనం నమ్మకం, విశ్వాసం పొందారని సర్వే సంస్థ తెలిపింది. హిందూ వర్గంలో ఓబీసీలు, క్రిస్టియన్ సామాజిక వర్గంలో ఎస్సీల ఆదరణ షర్మిలకు అధికంగా లభిస్తోందని మార్కెట్ రీసెర్చ్ అండ్ సోషల్ డెవలప్మెంట్ సర్వే ఆఫ్ తెలంగాణ-CMSD సంస్థ స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories