YS Sharmila Tweet: జగన్‌తో షర్మిలకు ఉన్న విభేదాలు నిజమయ్యేలా ట్వీట్..?

YS Sharmila Differences With his Brother YS Jagan Tweeted to Come True
x

జగన్- షర్మిల (ఫైల్ ఫోటో)

Highlights

* ఒంటరి దానినైనా అంటూ షర్మిల భావోద్వేగ ట్వీట్ * ఐ లవ్ & మిస్ యూ డాడీ అంటూ షర్మిల ట్వీట్ * హాట్‌టాపిక్‌గా షర్మిల ట్వీట్

YS Sharmila Tweet : వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా షర్మిల చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాదు గత కొన్ని రోజులుగా ఏపీ సీఎం జగన్‌తో షర్మిలకు ఉన్న విబేధాలు నిజమయ్యేలా ఆ ట్వీట్ ఉండటం గమనార్హం. ఇంతకీ ఆమె చేసిన ట్వీట్ ఏమిటో చూద్దాం.

ఒంటరి దానినైనా విజయం సాధించాలని.., అవమానాలెదురైనా ఎదురీదాలని., కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదుర్కోవాలని.., ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది.. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది. ఐ లవ్ & మిస్ యూ డాడీ అని షర్మిల ట్వీట్ చేశారు. అంటే తాను ఒంటరిని అయ్యానని ఇన్‌డైరెక్టర్‌గా షర్మిల ట్వీట్ రూపంలో చెప్పేసిందంటున్నారు కొందరు. సోదరుడు జగన్‌తో మనస్పర్థలున్నాయన్న విషయాన్ని స్పష్టంగానే చెప్పేసిందంటున్నారు. ఈ ట్వీట్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.

అంటే తాను ఒంటరినయ్యానని ఈ ట్వీట్ రూపంలో వైఎస్ షర్మిల చెప్పేశారు. దీన్ని బట్టి చూస్తే సోదరుడు జగన్‌తో మనస్పర్థలున్నాయన్న విషయం ఎవరికైనా స్పష్టంగానే అర్థమైపోతుంది. ఈ ట్వీట్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.

ఇక వైఎస్సార్ జయంతి రోజున, రాఖీ పండుగ రోజున కూడా అన్నా, చెల్లి ఇద్దరూ కలవలేదు. అయితే తాజాగా ఇద్దరూ ఇడుపులపాయలో కలుసుకున్నప్పటికీ.. అంతేకాదు ఇద్దరూ పక్కపక్కనే ఉన్నప్పటికీ ఒకర్ని ఒకరు పలకరించుకోకపోవడం గమనార్హం. ఇవాళ్టితో ఇద్దరి మధ్య ఉన్న విబేధాలకు ఫుల్‌స్టాప్ పడుతుందని, కచ్చితంగా ఇద్దరూ మాట్లాడుకుంటారని ఇన్ని రోజులుగా వస్తున్న పుకార్లకు ఫుల్ స్టాప్ పడుతుందని అభిమానులు, వైఎస్ అనుచరులు అనుకున్నప్పటికీ అవేమీ జరగలేదు.

నాన్న భౌతికంగా దూరమై 12ఏళ్లయినా జనం మనిషిగా, తమ ఇంట్లోని సభ్యునిగా నేటికీ జ‌న హృద‌యాల్లో కొలువై ఉన్నారని జగన్ ట్వీట్ చేశారు. చిరునవ్వులు చిందించే ఆయన రూపం, ఆత్మీయ పలకరింపు మదిమదిలోనూ అలానే నిలిచి ఉన్నాయి. నేను వేసే ప్రతి అడుగులోనూ, చేసే ప్రతి ఆలోచనలోనూ నాన్న స్ఫూర్తి ముందుండి నడిపిస్తోందని జగన్ ట్వీట్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories