YS Sharmila: ఎన్నికలు వచ్చేశాయ్.. కుంభకర్ణుడు నిద్రలేచాడు

YS Sharmila Comments On KCR
x

YS Sharmila: ఎన్నికలు వచ్చేశాయ్.. కుంభకర్ణుడు నిద్రలేచాడు 

Highlights

YS Sharmila:ఓట్ల కోసం కొత్త, పాత పథకాలకు తెరలేపుతున్నాడు

YS Sharmila: ట్విట్టర్‌ వేదికగా సీఎం కేసీఆర్‌పై YSRTP అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శనాస్త్రాలు సంధించారు. ఎన్నికలు వచ్చేశాయ్.. కుంభకర్ణుడు నిద్రలేచాడు. జిమ్మిక్కులు బయటపెడుతున్నాడు. ఓట్ల కోసం కొత్త, పాత పథకాలకు తెరలేపుతున్నాడు. ఇండ్లకు పైసలిస్తాడట.. పోడు పట్టాలిస్తాడట.. బీసీలకు ఆర్థికసాయం చేస్తాడట..

దొర చెప్పేది బారాణా అయితే ఇచ్చేది చారాణా మందం కూడా ఉండదని షర్మిల విమర్శించారు. 13 లక్షల డబుల్‌ బెడ్‌రూం దరఖాస్తులకు 30 వేలు కూడా ఇయ్యలేనోడు.. ఎన్నికలు వచ్చేసరికి నియోజకవర్గానికి 3 వేల మందికి 3 లక్షల చొప్పున ఇస్తాడట అంటూ చురకలు అంటించారు. గతంలో 15 రోజుల్లోనే 3 లక్షలు ఇస్తానని చెప్పిన కేసీఆర్ దొర.. ఇప్పుడు ముందు లక్ష, ఎన్నికల్లో గెలిస్తే లక్ష అంటూ తిరకాసు పెడుతున్నాడని ఆరోపించారు. ఇండ్ల పేరుతో 30 లక్షల కుటుంబాలను దగా చేసే పనిలో పడ్డాడని, పోడు భూములు 13.18 లక్షల ఎకరాలు ఉంటే.. 4.01లక్షల ఎకరాలకే పట్టాలు ఇచ్చి, చేతులు దులుపుకొని..

ఓట్లు లాక్కునే ప్రయత్నం చేస్తున్నాడని ఫైర్‌ అయ్యారు. తొమ్మిదేండ్లుగా బీసీలను నిండా ముంచిన దొర.. మళ్లీ బీసీల ఓట్లు అడిగితే గుంజి కొడతారని.. బీసీ కుల వృత్తులకు లక్ష పేరిట ఓట్లను కొనే పథకాన్ని ప్రవేశపెట్టాడన్నారు. గత ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన వాగ్ధానాల సంగతేంది దొరా..? అనిప్రశ్నించారు. రుణమాఫీకి దిక్కు లేదు.. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి లేదు.. దళితులకు మూడెకరాల భూమి లేదు.. డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఉచిత ఎరువులు పత్తా లేవు.. ఈసారి మళ్ళీ కేసీఆర్ పథకాలను, మాటలను నమ్మితే మిగిలేది గుండు సున్నానే అంటూ వైఎస్‌ షర్మిల ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories