విగ్‎తో బురిడీ కొట్టించాలనుకుని.... అధికారులకు ఈజీగా దొరికాడు

విగ్‎తో బురిడీ కొట్టించాలనుకుని.... అధికారులకు ఈజీగా దొరికాడు
x
Highlights

ఓ యువకుడు తలకు విగ్ ధరించి 1.13కేజీల బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించాలనుకున్నాడు. కానీ.. అధికారులకు ఈజీగా దొరికిపోయాడు.

ఓ యువకుడు తలకు విగ్ ధరించి 1.13కేజీల బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించాలనుకున్నాడు. కానీ.. అధికారులకు ఈజీగా దొరికిపోయాడు. ఈ సంఘటన కొచ్చిన్ నేషనల్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. మలప్పురానికి చెందిన నౌషద్ అనే వ్యక్తి షార్జా నుంచి కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చాడు. అంతకు ముందుగా తలపై మధ్యభాగంలో వెంట్రుకలను కత్తిరించుకున్నాడు. ఆ భాగంలో బంగారం పెట్టి దానిపై జుట్టు అధికంగా ఉన్న విగ్‎ను కొనుగోలు చేసి ధరించాడు. అనంతరం కొచ్చిన్ ఎయిర్ పోర్టు చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో కస్టమ్స్ అధికారుల కళ్ళు కప్పి తప్పించుకోవాలని అనుకున్నాడు. అధికారులు యువకుడిని తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డాడు. విగ్ లో ఉన్న 1.13 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు నౌషద్‎ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories