కేటీఆర్‎తో సమావేశమైన వైసీపీ ఎమ్మెల్యే ... కోడెల ప్రస్తావన..?

కేటీఆర్‎తో సమావేశమైన వైసీపీ ఎమ్మెల్యే ... కోడెల ప్రస్తావన..?
x
Highlights

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‎తో భేటీ అయ్యారు. గోదావరి, కృష్ణా అనుసంధానం చేస్తే రెండు రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి ఎవరిపైనా తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం లేదన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‎తో భేటీ అయ్యారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో తాజా రాజకీయాలపై కేటీఆర్‎తో కాటసాని చర్చించారు. అనంతరం మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.. ఆయన కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. రాష్ట్రం విడిపోయాక కూడా రాయలసీమకు అన్యాయమే జరుగుతోందని వ్యాఖ్యానించారు. మాజీ శాసనసభాధిపతి కోడెల శివప్రసాదరావు మరణంపై కాటసాని స్పంధించారు.

ప్రభుత్వానికి ఎవరిపైనా తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం లేదన్నారు. కోడెల మరణానికి టీడీపీనే కారణమన్నారు. కొద్దీ రోజులుగా కోడెలను చంద్రబాబు పక్కన పెట్టారని.., పార్టీ కార్యక్రమాలు, సమావేశాలకు కూడా పిలవలేదని తెలిపారు. కొంతమంది టీడీపీ కార్యకర్తలు కూడా కోడెల కుటుంబంపై ఫిర్యాదులు చేశారని గుర్తుచేశారు. బాధితుల ఫిర్యాదులతో కేసులు నమోదయ్యాయని గుర్తు పెట్టుకుంటే మంచిదన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories