Yadagirigutta: వాహనదారులకు ఇబ్బందిగా యాదగిరిగుట్ట-రాజాపేట రోడ్డు.. నరకం చూపిస్తున్న రహదారి

Yadagirigutta Rajapet Road Is A Problem For Motorists
x

Yadagirigutta: వాహనదారులకు ఇబ్బందిగా యాదగిరిగుట్ట-రాజాపేట రోడ్డు.. నరకం చూపిస్తున్న రహదారి 

Highlights

Yadagirigutta: తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్న ప్రయాణికులు

Yadagirigutta: అది నిత్యం రద్దీగా ఉండే రహదారి.. ఆ రోడ్డుకు చేరుకునే అన్ని రోడ్లు మెరిసి పోయేలా ఉన్నా... ఆ రోడ్డు మాత్రం వాహనదారులకు, ప్రయాణికులకు నరకం చూపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆ రోడ్డుకు గ్రహణం పట్టినట్టే అయ్యింది. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట నుంచి రాజాపేట వెళ్లే రోడ్డుపై ప్రయాణం చాలా ఇబ్బందికరంగా మారింది.

యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పునర్నిర్మాణం జరిపింది. యాదాద్రిగా మార్చి ఎక్కడికక్కడ రోడ్లు, ఇతర నిర్మాణాలు అభివృద్ధి చేసింది. అంతేకాదు రాయగిరి నుంచి నాలుగు లైన్లు యాదగిరిగుట్టకు.. .ఇక యాదగిరిగుట్ట నుంచి తుర్కపల్లికి...యాదగిరిగుట్ట నుంచి వంగపల్లికి..ఇలా అద్భుతమైన రోడ్లు ఉన్నాయి. కానీ యాదగిరిగుట్ట నుంచి రాజాపేట వైపు వెళ్లే రోడ్డుపై ప్రయాణం.. నరకంగా మారిందంటున్నారు వాహనదారులు.

ఈ రోడ్డుపై నిత్యం వాహనాల రద్దీ ఉంటుంది. యాదగిరిగుట్టకు వచ్చే భక్తులు కరీంనగర్, వేములవాడ, కొండగట్టుకు వెళ్తారు. ఇక రాజాపేట మండలంలోని పలు గ్రామాల వారు... జిల్లా కేంద్రానికి, హైదరాబాద్‌కు రావాలంటే ఈ రోడ్డుపై ప్రయాణంతో ఇబ్బందులు పడుతున్నారు. అధ్వాన్నంగా ఉన్న రోడ్డుతో పాటు పొట్టిమర్రి దగ్గర వాగు కారణంగా.. వర్షాకాలంలో మూడు, నాలుగు నెలలపాటు రాకపోకలు బంద్ కావాల్సిందేనని స్థానికులు, వాహనదారులు వాపోతున్నారు. రోడ్డుతో పాటు పొట్టి మర్రి వాగుపై హై లెవల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories