Yadadri: నేటి నుంచి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

Yadadri Brahmotsavams 2024 From Today
x

Yadadri: నేటి నుంచి యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

Highlights

Yadadri: 11 రోజులపాటు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న అధికారులు

Yadadri: అఖిలాంండ కోటి బహ్ర్మాండ నాయకుడు స్వయంభు పంచ నారసింహుడు యాదగిరిగుట్ట లశ్ర్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం అయ్యింది. తొలి రోజు స్వస్తి వాచనం, అంకురార్పణ, విశ్వక్సేనారాధన, రక్షా బంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 21వ తేదీన అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ప్రధాన ఆలయ ఉద్ఘాటన తర్వాత రెండో సారి వార్షిక బ్రహ్మోత్సావాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర మాడ వీధుల్లో స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు బ్రహ్మోత్సవ వేడుకల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 17న స్వామి వారి ఎదుర్కోలు, 18న స్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవం, 19న స్వామి వారి దివ్య విమాన రథోత్సవం నిర్వహించనున్నారు, 11 రోజుల పాటు స్వామి వారి నిత్య, మొక్కు, కల్యాణాలు, సుదర్శన నారసింహ హావన పూజలను నిలిపి వేస్తున్నట్టు ఆలయ ఆధికారులు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. పది వేల మంది కూర్చునే విధంగా కల్యాణ మండపాన్ని సిద్దం చేస్తున్నారు. ప్రధాన ఆలయ ముఖ మండపం, ఆంజనేయ స్వామి ఆలయంస, ఉపఆలయాలకు విద్యుత్ దీపాలంకరణ చేప్టటారు. కొండకింద పాతగుట్ట చౌరస్తా, బస్టాండ్, సమీపంలో భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. కొండపైన రథశాల ఎదుట కల్యాణ వేదిక ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టారు.

Show Full Article
Print Article
Next Story
More Stories