TS BJP: బీజేపీలో అసంతృప్త సెగలు.. మూడవ జాబితాపై అసంతృప్తిలో మహిళా నేతలు

Women Candidates Not Satisfied With Bjp Third List
x

BJP: బీజేపీలో అసంతృప్త సెగలు.. మూడవ జాబితాపై అసంతృప్తిలో మహిళా నేతలు

Highlights

TS BJP: బిజెపి ముద్దు.... జనసేన వద్దు అంటూ నినాదాలు

TS BJP: తెలంగాణ ఎన్నికలకు బీజేపీ విడుదల చేసిన మూడో అభ్యర్థుల జాబితాతో అసంతృప్త సెగలు రేగాయి. థర్డ్ లిస్టుపై మహిళా నేతలు మండిపడుతున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఐదుగురు మహిళలు టికెట్ కోసం పోటీ పడ్డారు. జూబ్లీహిల్స్ నుండి వీరపనేని పద్మ ఆశించగా.. సనత్ నగర్ నుండి ఆకుల విజయ, ముషీరాబాద్‌ నుంచి బండారు విజయ, అంబర్‌పేట నుంచి గీత మూర్తి, సికింద్రాబాద్ నుంచి బండ కార్తీక టికెట్ ఆశించారు. ఇందులో ఒక్కరికి కూడా టికెట్ దక్కలేదు.

ఇక ఓవరాల్‌గా ఇప్పటివరకు ఇచ్చిన 88 మంది అభ్యర్థుల్లో మహిళా మోర్చాలోని ఒక్క నేతకు కూడా టికెట్ రాలేదని మహిళా నేతలు మండిపడుతున్నారు. ఇక మాజీ మంత్రి ముఖేష్ గౌడ్‌ కుమారుడు విక్రమ్ గౌడ్ కూడా 3వ జాబితాలో తన పేరు లేకపోవడంతో అసంతృప్తిలో ఉన్నారు. దీంతో సికింద్రాబాద్ పార్లమెంటులో ఏదో స్థానంలో సర్దుబాటు చేస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది.

మరోవైపు బీజేపీలో జనసేన పొత్తు పంచాయితీలు తెగడం లేదు. నాగర్‌కర్నూల్‌ టికెట్ జనసేనకు ఇవ్వొద్దంటూ బీజేపీ రాష్ట్ర కార్యాలయం ముందు బీజేపీ నేత దిలీపాచారి నిరసన తెలుపుతున్నారు. దిలీపాచారితో పాటు నాగర్‌కర్నూల్ నుండి భారీగా వచ్చిన కార్యకర్తలు.. రాష్ట్ర కార్యాలయం ముందు బైఠాయించారు. బిజెపి ముద్దు.... జనసేన వద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories