మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో దారుణం

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో దారుణం
x
Highlights

* అంకుషాపూర్ గ్రామ సమీపంలోని.. * HPCL రైల్వే ట్రాక్ దగ్గర మహిళ మృతదేహం * కుళ్లిపోయిన స్థితిలో మహిళ మృతదేహం

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో దారుణం చోటు చేసుకుంది. అంకుషాపూర్ గ్రామ సమీపంలోని HPCL రైల్వే ట్రాక్ దగ్గర మహిళ మృతదేహం కలకలం రేపుతోంది. ఎలాంటి క్లూస్ లేకుండా మహిళలను దారుణంగా హత్య చేయడం పోలీసులకు సవాల్‌గా మారింది. ముఖం గుర్తు పట్టరాకుండా తగలబెట్టడం పై పలు అనుమానాలకు తావు ఇస్తుంది. దాంతో దర్యాప్తును ముమ్మరం చేశారు మహిళ ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

అంతేకాదు మహిళా చనిపోయిన మూడు నుంచి నాలుగు రోజులు అవుతుందని పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళా మృతదేహం కుళ్లిపోయి ఉండడంతో అత్యాచారం చేసి హత్య చేశారా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి సంబంధించిన వివరాలు తెలిస్తే కానీ, ఈ కేసు కొలిక్కి వచ్చేలా ఉందని పోలీసులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories