తెలంగాణలో ముగిసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ గడువు

* 12 స్థానాల్లో 6 స్థానాలు ఏకగ్రీవం.. మరో 6 స్థానాలకు ఎన్నికలు * రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో రెండేసి స్థానాలు ఏకగ్రీవం

Shilpa
Updated on: 26 Nov 2021 4:05 PM IST
Withdrawal of Local Body MLC Nominations Completed
X

ముగిసిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ గడువు(ఫైల్ ఫోటో)

TS MLC Nominations: తెలంగాణలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. రాష్ట్రంలో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే 12 స్థానాల్లో 6 స్థానాలు ఏకగ్రీవం కాగా మరో 6 స్థానాలకు డిసెంబర్‌ 10న పోలింగ్‌ జరగనుంది.

రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌లో రెండేసి స్థానాలు ఏకగ్రీవం కాగా వరంగల్‌, నిజామాబాద్‌లో ఒక్కో ఎమ్మెల్సీ స్థానం ఏకగ్రీవమైంది. ఇక కరీంనగర్‌లో రెండు, ఆదిలాబాద్‌, ఖమ్మం, మెదక్‌, నల్గొండలో ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 14న కౌంటింగ్ జరగనుంది.

Shilpa

Shilpa

Next Story