Delhi Liquor Scam: కవిత, కేజ్రీవాల్‌ను కలిపి విచారిస్తారా?

Will Kavitha and Kejriwal be interrogated together?
x

Delhi Liquor Scam: కవిత, కేజ్రీవాల్‌ను కలిపి విచారిస్తారా?

Highlights

Delhi Liquor Scam: కవిత, కేజ్రీవాల్‌ను కలిపి ఈడీ ప్రశ్నించే అవకాశం

Delhi Liquor Scam: మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు 6 రోజుల కస్టడీని విధించింది. 10 రోజుల పాటు కేజ్రీవాల్ ను కస్టడీకి ఇవ్వాలని రౌస్ అవెన్యూ కోర్టును ఈడీ కోరింది. చివరకు ఈ నెల 28 వరకు జ్యుడీషియల్ కస్టడీని విధిస్తూ తీర్పు వెల్లడించింది కోర్టు.

లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాలే కీలక సూత్రధారి అని ఈడీ ఆరోపించింది. సౌత్ గ్రూప్ సంస్థకు, నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని పేర్కొంది. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భారీ భద్రత నడుమ ఈడీ అధికారులు ఆయనని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు. 10 రోజుల రిమాండ్ కోరారు. మద్యం కుంభకోణంలో అరవింద్ కేజ్రీవాల్ కింగ్ పిన్ అని పేర్కొంది.

పంజాబ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుంచి 100 కోట్లు డిమాండ్ చేశారని తెలిపింది. 45 కోట్ల ముడుపులను గోవా ఎన్నికల్లో ఉపయోగించారని...అవి నాలుగు హవాలా మార్గాల నుంచి వచ్చాయని ఈడీ తరఫు న్యాయవాదులు వాదించారు. లిక్కర్​స్కామ్​కేసులో బీఆర్ఎస్​ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఢిల్లీ సీఎం అర్వింద్​కేజ్రీవాల్‌ను కలిపి విచారించేందుకు ఈడీ అధికారులు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories