వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరే: క్లారిటీ ఇచ్చిన కేసీఆర్

వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరే: క్లారిటీ ఇచ్చిన కేసీఆర్
x

వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరే: క్లారిటీ ఇచ్చిన కేసీఆర్

Highlights

భవిష్యత్తులో బీఆర్ఎస్ దే అధికారమని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ అన్నారు. శనివారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్ లో ఆయన కార్యకర్తలతో మాట్లాారు.

భవిష్యత్తులో బీఆర్ఎస్ దే అధికారమని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ అన్నారు. రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరి కన్నీటి గోస పేరుతో ఆరు రోజులుగా నిర్వహిస్తున్న నిర్వహిస్తున్న యాత్రశనివారం ఎర్రవల్లి ఫాంహౌస్ కు చేరుకుంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు.

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే అధికారంలోకి వస్తామిని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. ఆనాడు మోదీ తన మెడపై కత్తి పెట్టినా తెలంగాణ కోసం తాను ఏనాడూ వెనుకడుగు వేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నోటికి వచ్చిన హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ, ఒక్క హామీని అమలు చేయలేదని ఆయన విమర్శించారు. సిరిసంపదలున్న తెలంగాణను దోచుకోవడానికే కొందరు సిద్దంగా ఉన్నారని ఆయన విమర్శలు చేశారు. గత పదేళ్లలో తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవని..ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఎలా ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేశామో ఆయన వివరించారు. కానీ, ఇప్పుడు పరిస్థిత లేదన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories