తెలంగాణపై పంజా విసురుతున్న కరోనా.. మూడో దశ ముంచుకు రాబోతోందా?

తెలంగాణపై పంజా విసురుతున్న కరోనా.. మూడో దశ ముంచుకు రాబోతోందా?
x
representative image
Highlights

తెలంగాణ... కరోనా మూడో దశకు చేరుకుంటుందా? పంజా విసిరి ప్రాణాలు తోడేసేందుకు రెడీ అవుతోందా? మహమ్మారి కరోనాను కట్టడి చేసే ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయ్‌.?...

తెలంగాణ... కరోనా మూడో దశకు చేరుకుంటుందా? పంజా విసిరి ప్రాణాలు తోడేసేందుకు రెడీ అవుతోందా? మహమ్మారి కరోనాను కట్టడి చేసే ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయ్‌.? ముందస్తు వ్యూహాలు, కరోనాపై సమర సన్నాహాలు ఎలా సాగుతున్నాయ్‌.? తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లు ఏంటి?

తెలంగాణపై పంజా విసురుతున్న కరోనా. మూడో దశ ముంచుకు రాబోతోందా?. మూడో దశ ముప్పును ఎదుర్కొనే ఏర్పాట్లేంటి?. గచ్చిబౌలిలో 400 పడకలతో ప్రత్యేక ఆసుపత్రి. మూడోదశను ఎదుర్కొనేందుకు ముందస్తు సన్నాహాలు

తెలంగాణలో కరోనా కరాళ నృత్యం కొనసాగుతోంది. మూడో దశ వైపు దూకుడుగా దూసుకుపోతోంది. ఒక్కరోజే 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తొలి కేసు నమోదైన తర్వాత గుర్తించిన కేసుల్లో ఇదే అత్యధికం. అయితే ముంచుకొస్తున్న ముప్పును ఎదుర్కొనేందుకు యంత్రాంగం సర్వం సిద్దం చేసుకుండగా ప్రజల్లో ఒకరకమైన ఆందోళన కనిపిస్తోంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసులు క్రమంగా పెరుగుతుండడంతో వైద్యవర్గాల్లోనూ కలవరపెడుతోంది. ఏరోజుకారోజు మూడోదశలోకి చేరకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నా ఇప్పటికీ కొందరు అంతర్జాతీయ ప్రయాణికులు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణాలు చేస్తుండటంతో వైరస్‌ వ్యాప్తి పెరిగిపోతంది. కఠిన సమయంలో వైరస్‌ను ఎదుర్కోవడానికి ధీమాగా ముందస్తు ఏర్పాటు చేస్తున్న సర్కార్‌ మున్ముందు కేసుల సంఖ్య పెరిగితే తట్టుకునే సత్తాను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది.

కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా సర్కారు విస్తృత స్థాయిలో ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. తొలి ప్రాధాన్యంగా ప్రభుత్వ వైద్యంలోని అన్ని వసతులను కరోనా చికిత్సలకు వినియోగించుకోవాలని నిర్ణయించింది. గచ్చిబౌలిలోని బహుళ అంతస్తుల భవనాలను కూడా కరోనా ప్రత్యేక ఆసుపత్రిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోని సుమారు 400 గదుల్లో సుమారు 800 ఐసోలేషన్‌ గదులుగా విభజించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ మిథానిలో వెంటిలేటర్ల తయారీకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పడకలను పూర్తిస్థాయిలో వినియోగించుకున్న తర్వాత అప్పటికీ తీవ్రత అధికంగా ఉంటే అన్ని ప్రైవేటు బోధనాసుపత్రులనూ వాడుకోనుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories