Mahabubabad: భర్తకు రెండో పెళ్లి చేసిన భార్య

Wife Marriages Her Husband With Another Woman In Mahabubabad
x

Mahabubabad: భర్తకు రెండో పెళ్లి చేసిన భార్య

Highlights

Mahabubabad: ఓ మహిళ తన భర్తకు దగ్గరుండి మరో యువతితో పెళ్లి చేసింది.

Mahabubabad: ఓ మహిళ తన భర్తకు దగ్గరుండి మరో యువతితో పెళ్లి చేసింది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. మహబూబాబాద్‌కు చెందిన సురేష్, సరిత దంపతులకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే, సురేష్‌కు ఓ మేనమామకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురికి ఇప్పటికే వివాహం జరగ్గా చిన్న కూతురు సంధ్య ఓ మానసిక వికలాంగురాలు. ఆమెకు ఇంకా వివాహం కాలేదు. తమ తర్వాత ఆమె పరిస్థితి ఏంటని తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సంధ్య గురించి పూర్తిగా తెలిసి అర్థం చేసుకున్న వారే ఆమెను బాగా చూసుకుంటారని భావించారు.

సంధ్య తల్లిదండ్రులు సురేష్ దంపతుల ముందు రెండో పెళ్లి ప్రతిపాదన పెట్టారు. సరితకు కూడా సంధ్య గురించి పూర్తిగా తెలుసు. ఆమెను చెల్లెలిగానే చూస్తూ వస్తోంది. మానసిక వికలాంగురాలైన సంధ్య సురేష్‌ను ఇష్టపడిందని తెలుసుకున్న సరిత వీరి పెళ్లికి అంగీకరించింది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆలయంలో బంధు మిత్రుల సమక్షంలో సురేష్, సంధ్యల వివాహం దగ్గరుండి మరీ జరిపించారు. సంధ్య తనకు చెల్లి వంటిదని, ఆమె బాగోగులు చూసుకోవడానికే ఈ పెళ్లికి అంగీకరించానని సురేష్ మొదటి భార్య సరిత తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories