School Holidays: తెలంగాణలో 3 రోజులు స్కూళ్లకు సెలవులు..ఎందుకు? ఎప్పటినుంచి?

School Holidays
x

School Holidays: భారీ నుంచి అతి భారీ వర్షాలు..స్కూళ్ల కు సెలువులు?

Highlights

School Holidays: విద్యార్థులకు ముఖ్య గమనిక. మూడు రోజులు పాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఎందుకు, ఎప్పటి నుంచి అని తెలుసుకోవాలని ఉందా. అయితే ఈ స్టోరీ చదవండి.

School Holidays: విద్యార్థులకు బిగ్ అలర్ట్. పాఠశాలల సెలవులకు సంబంధించి విద్యాశాఖ కీలక అంశాన్ని వెల్లడించింది. ఎన్ని రోజులు పాఠశాలలు పనిచేస్తాయి. ఎన్ని రోజులు సెలవులు ఉంటాయి. వంటి విషయాలను తెలిపింది. విద్యాశాఖ ప్రకారం చూస్తే..ఈ విద్యా సంవత్సరంలో 233రోజులు పాఠశాలలు పనిచేస్తాయి. 325రోజులు ఉండగా..ఇందులో 82 రోజులు సెలవులు ఉన్నాయి. ఈ విషయాన్ని విద్యాశాఖ అకాడమిక్ క్యాలెండర్ ను రూపొందింది. టోఫెల్ తరగతుల నిర్వహణపై ఏపీ సర్కార్ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు ఉంటాయని..ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు కొనసాగుతాయని తెలిపింది.

2024-25 విద్యా సంవత్సరంలో అకాడమిక్ క్యాలెండర్ ను పరిశీలిస్తే..సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలుసుకుందాం. పండగల సెలవులు చూస్తే దసరా సెలవులు అక్టోబర్ 3 నుంచి 13 వరకు..క్రిస్మస్ సెలువలు డిసెంబర్ 20 నుంచి 29 వరకు ఉంటాయి. సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 19 వరకు ఉంటాయి.

ప్రస్తుతం ఏపీలో భారీ వర్షాలు కురస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా జిల్లాల్లో ముందుగానే పాఠశాలలకు సెలువులు ప్రకటించాయి. వర్షాలు భారీగా పడే జిల్లాల్లో పాఠశాలలకు హాలుడేస్ ఇస్తున్నారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. అటు తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ఇవ్వాలన్న డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఈ మేరకు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామక్రుష్ణ సీఎంకు లేఖ రాశారు. నదులు, చెరువులు భారీగా నిండిపోయాయని..విద్యార్థులు స్కూళ్లకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తెలంగాణలో వాతావరణం చూస్తే మరో రెండు మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలతో పిల్లలకు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు సోకకుండా మూడు రోజులు సెలవులు ఇవ్వాలని భారత విద్యార్థి సమాఖ్య హయత్ నగర్ మండల కార్యదర్శి అరుణ్ కుమార్ గౌడ్, హైదరాబాద్ నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు.


Show Full Article
Print Article
Next Story
More Stories