అసలు ఎవరు ఈ తమిలిసై సౌందర్ రాజన్ ?

అసలు ఎవరు ఈ తమిలిసై సౌందర్ రాజన్ ?
x
Highlights

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నూతన గవర్నర్లను నియమించింది. తెలంగాణ గవర్నర్ గా తమిలిసై సౌందర్ రాజన్ ను నియమించారు. హిమాచల్ ప్రదేశ్...

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం నూతన గవర్నర్లను నియమించింది. తెలంగాణ గవర్నర్ గా తమిలిసై సౌందర్ రాజన్ ను నియమించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, మహారాష్ర్ట గవర్నర్ గా భగత్ సింగ్ కోషియారి, కేరళ గవర్నర్ గా ఆరీఫ్ మహ్మద్ ఖాన్ ను నియాకమం అయ్యారు. హిమాచల్ గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను రాజస్థాన్ కు బదిలీ అయ్యారు. ఇప్పటి వరకు మహారాష్ర్ట గవర్నర్ గా పని చేసిన విద్యాసాగర్ రావు, తెలంగాణ గవర్నర్ గా పనిచేసిన నర్సింహన్ కు మాత్రం ఎలాంటి పదవి ఇవ్వలేదు.

అయితే తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ గా నియమించబడ్డ తమిలిసై సౌందర్ రాజన్ ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలో నెలకొంది ..తమిలిసై సౌందర్ రాజన్ బీజేపీ పార్టీ నాయకురాలు.. ఈమె బీజేపీ పార్టీకి జాతీయ కార్యదర్శిగా కూడా పనిచేసారు... జూన్ 2, 1961 న తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోయిల్‌లో జన్మించారు ...ఆమె తండ్రి కుమారి ఆనందన్... అయన మాజీ పార్లమెంటు సభ్యుడు మరియు తమిళనాడులో సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ... ఆమె భర్త సౌందర్ రాజన్ ప్రముఖ డాక్టర్ ..పలు వైద్య శాస్త్రాలలో మంచి నైపుణ్యం కలవాడు .. తమిలిసై సౌందర్ రాజన్ చెన్నైలోని మద్రాస్ మెడికల్ కాలేజీలో MBBS విద్యను అభ్యసించారు ..

ఆమె రాజకీయ కుటుంబంలో పుట్టింది కాబట్టి చిన్నప్పటి నుండి రాజకీయాలపై ఆసక్తిని పెంచుకున్నారు . మద్రాస్ మెడికల్ కాలేజీలో చదువుకునే సమయంలో ఆమె విద్యార్థి నాయకురాలిగా ఎన్నికయ్యారు. ఆమె తండ్రి కాంగ్రెస్ పార్టీ చెందినవాడు అయినప్పటికీ, ఆమె ఎక్కువగా బీజేపీ భావజాలనికి ఆకర్షితురాలు అయ్యారు . బీజేపీ తరపున ఆమె చాలా సేవలను అందించారు . రాజకీయ నాయకురాలుగానే కాకుండా ఆమె విద్యార్థులు మరియు పిల్లల కోసం ఒరేటరీ స్కిల్స్ లాంటి చాలా విజయవంతమైన కార్యక్రమాలను నిర్వహించారు. సౌందర్ రాజన్ 2006, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరుపున పోటి చేయగా రెండు సార్లు ఓడిపోయారు . ఇక 2009, 2019 సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ తరుపున పోటి చేసి ఓటమిని చవిచూశారు .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories