Telangana: తెలంగాణలో కేంద్ర మంత్రి పదవి ఎవరికి.?

Who Has The Position Of Union Minister In Telangana?
x

Telangana: తెలంగాణలో కేంద్ర మంత్రి పదవి ఎవరికి.?

Highlights

Telangana: లక్ష్మణ్, బండి సంజయ్ కాకుండా మరో పేరు తెరపైకి తెస్తారా..?

Telangana: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని మార్చి కిషన్ రెడ్డికి పగ్గాలు అప్పగించింది అధినాయకత్వం. అయితే కిషన్ రెడ్డిని కేంద్ర మంత్రి పదవిలో కొనసాగిస్తూనే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంచుతారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సెంట్రల్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో తెలంగాణను పరిగణలోని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డిని రాజీనామా చేయిస్తే మంత్రి పదవి ఎవరిని వస్తుందన్న చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.

బండి సంజయ్‌ని పార్టీ అధ్యక్షుడిగా తొలగించింది కాబట్టి... తప్పకుండా మంత్రి వర్గంలోకి తీసుకుంటారన్న చర్చ జోరుగా సాగుతోంది. పార్టీకి బండి చేసిన సేవలను హైకమాండ్ గుర్తిస్తుందని... ఆమేరకు బండి స్పష్టమైన హామీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హస్తిన కేంద్రంగా నడ్డా.. బండి మధ్య ఇదే అంశంపై చర్చ జరిగినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరో వైపు సీనియర్ నాయకుడు లక్ష్మణ్‌కు సైతం కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీనియారిటీ ఆధారంగా లక్ష్మణ్‌ను పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తోంది. ఇటు సోయం బాపూరావును సైతం కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోవడం ద్వారా సామాజిక నేపథ్యంలో న్యాయం చేసినవారిమవుతామన్న భావనలో హైకమాండ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories