షర్మిల ఎవరిని ఫాలో అవుతున్నారు..? ఏ వ్యూహంతో ముందుకు వెళుతున్నారు..?

Ys Sharmila New Party
x
షర్మిల ఫైల్ ఫోటో 
Highlights

YS Sharmila:తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా వైఎస్‌ షర్మిల పావులు కదుపుతున్నారు.

YS Sharmila: తెలంగాణలో రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా వైఎస్‌ షర్మిల పావులు కదుపుతున్నారు. పార్టీ పెట్టక ముందే ఉద్యమాలకు సైతం సై అంటున్నారు. సొంతంగా పార్టీ ఏర్పాటు చేసి సీఎం కావాలనుకుంటున్న షర్మిల అసలు ఏ వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. ఎవరిని ఫాలో అవుతున్నారు ? ఆమె భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతోంది ? వాచ్ దిస్ స్టోరి.

తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతుంది. వైఎస్‌ షర్మిల నేతృత్వంలో ఆ కొత్త పార్టీ వస్తుందని క్లారిటీ కూడా వచ్చేసింది. షర్మిల చేసే కార్యక్రమాల పైనే అందరి దృష్టి నెలకొంది. పార్టీ ఏర్పాటు చేయక ముందు నుంచే షర్మిల ఉద్యమాలకు సై అంటున్నారు. ఫీల్డ్‌లోకి వచ్చి నిరసనలు దీక్షలు చేస్తున్నారు. ఇప్పటికే 33 జిల్లాల ముఖ్యనేతలతో వైఎస్ షర్మిల సమావేశమయ్యారు. ఈ నెల 9న ఖమ్మంలో భారీ బహిరంగ సభ కూడా పెట్టి పార్టీ ఏర్పాటు విషయాన్ని ప్రకటించారు. ఇక ఆ తరువాత ఉద్యోగ దీక్ష పేరుతో 72 గంటల నిరసన దీక్ష చేశారు. పోలీసులు అనుమతి ఇవ్వకున్నా దీక్ష కొనసాగించారు. ఇలా దూకుడు, మొండితనం చూస్తే షర్మిల తన అన్న జగన్ బాటలో నడుస్తున్నారని చర్చ జరగుతోంది.

ప్రస్తత ఏపి సిఎం జగన్మోహన్ రెడ్డి గతంలో తన తండ్రి చనిపోయిన తర్వాత సొంత పార్టీ పెట్టారు. పార్టీ ఏర్పాటు చేయక ముందే ఓదార్పు యాత్ర మొదలు పెట్టారు. వైసిపి ఏర్పాటు తరువాత కూడా జగన్ ప్రభుత్వంపై పోరాటానికి నిరసన దీక్షలు చేసేవారు. 48 గంటల దీక్షలు, 72 గంటల దీక్షలు చేసి అప్పటి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. ఇప్పుడు షర్మిల కూడా పార్టీ ఏర్పాటు కంటే ముందు గానే 72 గంటల దీక్ష చేశారు. దీన్ని బట్టి చూస్తే ఆమె అన్న జగన్‌ బాటలోనే నడుస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది.

పొత్తుల విషయంలో కూడా జగన్ బాట లోనే షర్మిల నడుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు రెండు ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్‌ను లీడ్ చేసిన జగన్ రెండు సార్లు ఒంటరిగానే ఎన్నికల బరిలో దిగారు. రెండు సార్లూ ఆయన బీజేపీతో కలిసి పోటీ చేస్తారని వార్తలు వచ్చినా ఆయన మాత్రం ఒంటరిగానే ఎలక్షన్‌ ఫైట్‌ చేశారు. ఇప్పుడు షర్మిల కూడా అదే పంథా అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. తాను ఏ పార్టి వదిలిన బాణాన్ని కాదని తాను ప్రజలు వదిలిన బాణం అని చెపుతూ అన్న బాటలోనే పోరాటాలకు సిద్దం అవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories