Congress: షర్మిల విషయంలో కాంగ్రెస్ వ్యూహం ఏంటి..?

What Is The Strategy Of Congress In The Case Of Sharmila
x

Congress: షర్మిల విషయంలో కాంగ్రెస్ వ్యూహం ఏంటి..?

Highlights

Congress: పాలేరు నుంచే షర్మిల బరిలోకి దిగుతారా..?

Congress: కాంగ్రెస్‌లో YSRTP విలీనం అయిపోయినట్లే. హస్తం పార్టీలో షర్మిల రోల్ ఏ విధంగా ఉండబోతోంది..? వచ్చే.. ఎన్నికల్లో షర్మిల ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారు....? తెలంగాణ నుంచా..? లేక ఏపీ నుంచా..? షర్మిల ఢిల్లీ వెళ్లిన తర్వాత దాదాపుగా ఇవే అంశాలపై చర్చలు జరిగాయి.. కానీ..ఒక్కసారిగా మళ్లీ సందిగ్ధత.. అవును.. కాంగ్రెస్‌లో YSRTP విలీనంపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రెండు వారాలుగా హస్తం నేతలతో చర్చలు జరుపుతున్నా..కొన్ని అంశాల్లో ఇంకా స్పష్టమైన హామీ రాకపోవడంతో..షర్మిల పార్టీ విలీనంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది..

కాంగ్రెస్ నేతలు మాత్రం త్వరలోనే షర్మిల పార్టీ విలీనం ఉంటుందని చర్చించుకుంటున్నారు. ఈ నెల 17న లేదా 18న విలీనం చేస్తారని గాంధీ భవన్ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక వేళ.. కాంగ్రెస్‌లో విలీనం చేస్తే షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారు..? పాలేరు నుంచి పోటీ చేస్తానని గతంలో షర్మిల ప్రకటించారు. అయితే ఆ సీటు విషయంలో.. కాంగ్రెస్ హై కమాండ్ పొంగులేటికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షర్మిల పోటీ అంశం పైనా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది.

ఇటీవల ఢిల్లీకి వెళ్లిన షర్మిల కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపారు. హస్తం పార్టీ పెద్దల ముందు షర్మిల కొన్ని డిమాండ్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ డిమాండ్లపై క్లారిటీ లేకపోవడంతో ఇటు షర్మిల నుంచి కానీ..అటు కాంగ్రెస్ నుంచి కానీ YSRTP విలీనం పై స్పష్టమైన ప్రకటన రాలేదు. అయితే వారం రోజుల్లో మరోసారి చర్చలు జరిపి..వీలైనంత త్వరగా విలీనం ప్రక్రియ పూర్తి చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది..

Show Full Article
Print Article
Next Story
More Stories