Jana Samithi: రాబోయే ఎన్నికల్లో తెలంగాణ జన సమితి ప్రాత ఏంటి..?

What Is Telangana Jana Samithi Role In The Upcoming Elections?
x

Jana Samithi: రాబోయే ఎన్నికల్లో తెలంగాణ జన సమితి ప్రాత ఏంటి..? 

Highlights

Jana Samithi: 2018 మార్చి 31న తెలంగాణ జన సమితి ఏర్పాటు

Jana Samithi: ఫ్రొ.కోదండ రామ్ దారెటు..? రాబోయే ఎన్నికల్లో తెలంగాణ జన సమితి ప్రాత ఏంటి..? క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి బలమైన లీడర్లు, కేడర్ లేకపోవడంతో ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో టీజేఎస్ ఎన్నికల బరిలో నిలవాలంటే ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందే. మరి కోదండరామ్ ఎవరితో కలుస్తారు. ఇకపై పార్టీని నడపడం కూడా భారంగా మారడంతో వచ్చే ఎన్నికల్లో పొత్తుల వరకే పరిమితం అవుతారా లేక మొత్తం పార్టీనే విలీనం చేస్తారా.? ఇంతకు టీజేఎస్‌తో పొత్తుకు ఏ పార్టీ సుముఖంగా ఉంది. కోదండం రామ్ అడిగిన సీట్లను.. పొత్తు పెట్టుకున్న పార్టీ ఇస్తుందా?

తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు కోదండరామ్. వృత్తిపరంగా ప్రొఫెసర్ అయిన కోదండరామ్..రాష్ట్ర ఆవిర్భావ అవశ్యకతను వివరిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేశారు. 2004లో తెలంగాణ విద్యావంతుల వేదికను ఏర్పాటు చేసి..దానికి అధ్యక్షునిగా వ్యవహరించారు. తుది దశ పోరులో 2009 డిసెంబర్ 24న జేఏసీకి కన్వీనర్ గా ఉన్నారు. శాంతియుత మార్గంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపారు. ఐతే తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్‌తో విభేదించిన కోదండరామ్.. 2018 మార్చి 31న టీజేఎస్‌ను ఏర్పాటు చేశారు. తెలంగాణ ఉద్యమ సారథిగా సక్సెస్ అయిన ఆయన.. పొలిటికల్ లీగర్‌గా మాత్రం అనుకున్న లక్ష్యాలను చేరుకోలేదు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం అయ్యారు.

2018 ఎన్ని్కల్లో కాంగ్రెస్, టీడీపీతో కలసి కోదండరామ్ కూటమి కట్టారు. కానీ ఆ కూటమి విఫల ప్రయోగంగానే మిగిలింది. టీజేఎస్‌ ఒక్క సీటు కూడా గెలుచుకోలేపోయింది. కోదండరామ్ వ్యతిరేకించిన కేసీఆరే...రెండోసారి అధికారంలోకి వచ్చారు. 2019లోక్ సభ ఎన్నికల్లోనూ టీజేఎస్ పాత్ర శూన్యమనే చెప్పాలి. అప్పటి నుంచి.. ఏదో పార్టీ ఉందా అంటే ఉంది అన్నట్టుగా మాత్రమే నడుస్తోంది. ప్రజా సమస్యపై కోదండరామ్ పోరాడుతున్నా.. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్నా పార్టీ తరపున మాత్రం ఎలాంటి పోరాటాలు లేవు. పార్టీ పరిస్థితిని చూసి ఉన్న కేడర్ కూడా ఇతర పార్టీల్లోకి వలసపోవడంతో టీజేఎస్ మరింత బలహీనపడింది.

త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి లేకపోవడంతో.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు కోదండరామ్. తెలంగాణ జన సమితికి ఆరు సీట్లు కావాలంటూ కోదండరాం కాంగ్రెస్ పార్టీ ముందు ఓ ప్రతిపాదన ఉంచారు. ఆరు సీట్లు, ఆ స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్న తమ అభ్యర్థుల జాబితాను తెలంగాణ కాంగ్రెస్ ఇన్ చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేకి అందించారు. అధినాయకత్వంతో చర్చించి సీట్ల విషయం తేలుస్తామని కోదండరాంకి ఠాక్రే హామీ కూడా ఇచ్చారు. అయితే కోదండరాం పార్టీకి ఆరు సీట్లు.. కాంగ్రెస్ త్యాగం చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి. లీడర్లు, కేడర్ లేకపోయినా.. తెలంగాణ ఉద్యమ రథసారథిగా కోదండ రామ్‌పై జనాల్లో.. సానుకూల దృక్పథమే ఉంది. అందుకే కేసీఆర్ ని దెబ్బతీయాలంటే.. కూటమిలో కోదండరాం ఉండాలంటున్నారు కొంతమంది హస్తం పార్టీ నేతలు.

Show Full Article
Print Article
Next Story
More Stories