KTR: రానున్న రోజుల్లో ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తాం

We Will Show The Film To The Opposition In The Coming Days Says KTR
x

KTR: రానున్న రోజుల్లో ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తాం

Highlights

KTR: SRDPలో భాగంగా రోడ్ల అభివృద్ధి పరుగులు పెడుతోంది

KTR: అన్ని వర్గాల కలుపుకొని పనిచేస్తేనే హైదరాబాద్‌ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుందన్నారు మంత్రి కేటీఆర్. ఇందిరాపార్క్ నుంచి VST వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్.. సెంట్రల్ హైదరాబాద్ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామన్నారు. స్టీల్‌ బ్రిడ్జికి నాయిని నర్సింహా రెడ్డి పేరు పెట్టాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారన్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇందిరా పార్కును అంతర్జాతీయ ప్రమాణాలతో అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత తమదని వెల్లడించారు. లోయర్‌ ట్యాంక్‌బండ్‌, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌ను కలిపి అద్భుతంగా మారుస్తామన్నారు. విశ్వనగరంగా హైదరాబాద్‌ ఎదగాలనే కలకు పునాది పడిందని చెప్పారు. కేసీఆర్‌ను హ్యాట్రిక్‌ సీఎంగా మళ్లీ కూర్చోబెట్టాలన్నారు. రానున్న రోజుల్లో ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తామని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories