Top
logo

మా వద్ద ప్లాన్స్ ఉన్నాయ్.. అవి బయటకు తీస్తే..

మా వద్ద ప్లాన్స్ ఉన్నాయ్.. అవి బయటకు తీస్తే..
Highlights

తెలంగాణలో మరో రెండు దఫాలు టీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు సీఎం కేసీఆర్. తమ వద్ద మరో నాలుగైదు స్కీమ్స్‌కు ప్లాన్స్ ఉన్నాయని..అవి బయటకు తీస్తే ప్రతిపక్షాలు ఖతమ్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం రుణమాఫీపై రూ.6వేల కోట్లు బడ్జెట్లో కేటాయించామని త్వరలోనే రైతులకు ఆ డబ్బు అందుతుందని చెప్పారు.

తెలంగాణ శాసనసభ సమావేశాలల్లో వాడివేడిగా చర్చ నడిచింది. బడ్జెట్ సమావేశాల ముగింపు సందర్భంగా ఆదివారం సభలో కేసీఆర్ విపక్షాలపై నిప్పులు చెరిగారు. దేశంలో కాంగ్రెస్ చేసిన దుర్మార్గాలు ఏ పార్టీ చేయలేదని విమర్మిచారు. కాంగ్రెస్ హయాంలోనే మహిళల అక్రమ రవాణా,డ్రగ్స్ సరఫరా వంటి అసాంఘీక శక్తులు సమాజంలోకి చొరబడ్డాయని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే అని ఈ రెండు పార్టీల వలనే దేశంలో ఆర్థిక మాంద్యం నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రెండు పార్టీల వల్లే దేశంలో పేదరికం పెరిగిపోయిందన్నారు.

కాంగ్రెస్ హయాంలో తెలంగాణకు చాలా నష్టం జరిగిందన్నారు. నక్సలిజానికి.. అమాయకులు బలైపోవడానికి కారణం కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కల్యాణ లక్ష్మి, 24 గంటల విద్యుత్,రైతులకు ఉచిత్ విద్యుత్,రూ.2వేల ఫించన్ వంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చామని చెప్పారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో ప్రజలకు మేలు చేసే పథకాలను అమలుచేస్తున్నామని చెప్పారు.

తెలంగాణలో మరో రెండు దఫాలు టీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుందన్నారు సీఎం కేసీఆర్. తమ వద్ద మరో నాలుగైదు స్కీమ్స్‌కు ప్లాన్స్ ఉన్నాయని..అవి బయటకు తీస్తే ప్రతిపక్షాలు ఖతమ్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం రుణమాఫీపై రూ.6వేల కోట్లు బడ్జెట్లో కేటాయించామని త్వరలోనే రైతులకు ఆ డబ్బు అందుతుందని చెప్పారు. రైతులే తమ అప్పులు కట్టుకుంటే, తర్వాత ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం వారికి చేరుతుందన్నారు. తాము తీసుకురాబోయే నూతన రెవెన్యూ చట్టం కూడా దేశానికి ఆదర్శంగా నిలవబోతుందని..మిగతా రాష్ట్రాలు కూడా దాన్ని కాపీ కొట్టడం ఖాయమని అన్నారు. ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తే తాము కూడా సహకరిస్తామని అంతే తప్ప అడ్డగోలు విమర్శలు సరికాదని కేసీఆర్ సూచించారు.


లైవ్ టీవి


Share it
Top