Guvvala Balaraju: సీఎం కేసీఆర్ వదిలిన బాణంగా పనిచేస్తాం..

Guvvala Balaraju: తమను చంపుతామని కొందరు బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 15 Nov 2022 8:30 PM IST
We are Receiving Death Threat Calls Says MLA Guvvala Balaraju
X

Guvvala Balaraju: సీఎం కేసీఆర్ వదిలిన బాణంగా పనిచేస్తాం..

Guvvala Balaraju: తమను చంపుతామని కొందరు బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పనిచేస్తామని..ఎవ్వరికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. చంపేస్తామంటూ తమకు బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని బాలరాజు తెలిపారు. రక్షణ కోసమే మమ్మల్ని ప్రగతిభవన్‌లో ఉండాలని సీఎం కేసీఆర్ చెప్పారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వెల్లడించారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారమే ప్రగతిభవన్‌లో ఉన్నామని, మమ్మల్ని ఇబ్బందిపెట్టే ఎవరినీ వదిలిపెట్టమని ఎమ్మెల్యే బాలరాజు హెచ్చరించారు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్న బీజేపీని దోషిగా నిలబెడతామని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టం చేస్తున్నారు. కేసీఆర్ వదిలిన బాణంగా తాము పనిచేస్తామన్నారు ఎమ్మెల్యే గువ్వల.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story