Telangana: ధియేటర్లు యథావిధిగా కొనసాగుతాయి

We are not Going to Shutdown the Movie Theaters
x

తెలంగాణ:(ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Telangana: కరోనా నేపథ్యంలో థియేటర్లను బంద్ చేస్తారనే వదంతులపై తలసాని స్పందించారు.

Telangana: దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా సెకండ్ వేవ్ తెలంగాణలో కూడా విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలను బంద్ చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. థియేటర్లను కూడా బంద్ చేస్తారనే వందుతులు వస్తున్నాయి దానిలో ఎలాంటి వాస్తవం లేదని మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ తెలిపారు. సినిమా థియేట‌ర్లు యథావిధిగా కొన‌సాగుతాయని స్ప‌ష్టం చేశారు. అయితే, థియేట‌ర్ల య‌జామానులు సినిమా హాళ్ల‌లో కొవిడ్ నిబంధ‌న‌లు పాటించేలా పూర్తి స్థాయి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆయన సూచించారు. థియేట‌ర్ల‌ను మూసి వేస్తారంటూ వ‌స్తోన్న ప్ర‌చారాన్ని న‌మ్మ‌కూడ‌ద‌ని ఆయ‌న ప్ర‌జ‌ల‌కు సూచించారు. కొన్ని ల‌క్ష‌లాది మంది జీవితాలు సినీ ప‌రిశ్ర‌మ‌పై ఆధార‌ప‌డి ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు. అంద‌రి ప్ర‌యోజ‌నాల‌ను, ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని నిర్ణ‌యాలు తీసుకుంటున్నామ‌నితెలిపారు. అంద‌రూ క‌రోనా నిబంధ‌న‌ల‌ను పాటించాల‌ని పిలుపునిచ్చారు.

మరోవైపు సినిమా థియేటర్లు కూడా మూసివేయాలనే ప్రతిపాదనలు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి పంపించింది. తెలంగాణలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే చేయి దాటిపోయే ప్రమాదం ఉందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ థియేటర్లు పూర్తిస్థాయిలో మూసివేత సాధ్యం కాకుంటే సగం సీట్లు (50%) మాత్రమే అక్యూపెన్సీ నిబంధనలు విధించాలని సూచించింది. వరుసగా కొత్త సినిమాలు విడుదలవుతుండటంతో థియేటర్లు 90 శాతంపైగా నిండిపోతున్నాయని, ప్రేక్షకులు మాస్కులు ధరించకుండా పక్క పక్క సీట్లతో కూర్చోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories