Talasani Srinivas Yadav: మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

We Are Committed To The Welfare Of Minorities Says Talasani Srinivas Yadav
x

Talasani Srinivas Yadav: మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం

Highlights

Talasani Srinivas Yadav: రాబోయే రోజుల్లో వారి సంక్షేమం కోసం మరింత కృషి చేస్తాం

Talasani Srinivas Yadav: సికింద్రాబాద్.. మైనార్టీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని మైనార్టీ ముస్లిం మత పెద్దలు, ముఖ్య నాయకులు, ఇమామ్‌లతో సమావేశమయ్యారు. గత తొమ్మిదేళ్లుగా సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలో మసీదులు, రహదారులు, ముస్లిం ఖబరస్తాన్‌లను అన్ని విధాల అభివృద్ధి చేసినట్టు తెలిపారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో కారు వేగం పుంజుకుందని, ప్రతిపక్షాలకు అడ్రస్ గల్లంతవ్వడం ఖాయమన్నారు. ముస్లిం మైనార్టీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అందజేస్తుందని... రాబోయే రోజులలో వారి సంక్షేమం కోసం మరింత కృషి చేస్తామన్నారు. ముస్లింలంతా ఏకతాటి పైకి వచ్చి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాయకత్వాన్ని బలపరిచి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కుమారుడు కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories