ఆదిలాబాద్‌లో జలపాతాలకు జలకళ

Waterfalls in Adilabad | TS News
x

ఆదిలాబాద్‌లో జలపాతాలకు జలకళ

Highlights

పరవళ్లు తొక్కుతున్న కుంటాల, పొచ్చర జలపాతాలు

Adilabad: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల, పొచ్చర జలపాతాలు జలకళను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి వరద నీరు పొటెత్తుతోంది. దీంతో కుంటాల, పొచ్చర జలపాతాలు పరవళ్లు తొక్కుతున్నాయి. వేసవి కాలంలో నీరు లేక జలపాతాలు బోసిపోయి కనిపించాయి. ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న భారీ వరదతో జలకళను సంతరించుకున్నాయి. దీంతో పర్యాటకుల తాకిడి కూడా పెరిగింది. అయితే జలపాతల వద్దకు వెళ్లకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories