Telangana: సరళాసాగర్‌ ప్రాజెక్టుకు భారీ గండి

Telangana: సరళాసాగర్‌ ప్రాజెక్టుకు భారీ గండి
x
సరళాసాగర్‌ ప్రాజెక్టుకు భారీ గండి
Highlights

వనపర్తి జిల్లా శంకరం పేట సమీపంలో సరళసాగర్ ప్రాజెక్టుకు గండి పడటంతో భారీగా నీరు వృథాగాపోతోంది. గత పదేళ్లలో తొలిసారిగా సరళసాగర్ ప్రాజెక్టుకు భారీగా నీరు...

వనపర్తి జిల్లా శంకరం పేట సమీపంలో సరళసాగర్ ప్రాజెక్టుకు గండి పడటంతో భారీగా నీరు వృథాగాపోతోంది. గత పదేళ్లలో తొలిసారిగా సరళసాగర్ ప్రాజెక్టుకు భారీగా నీరు చేరింది. ఇదే సమయంలో ప్రాజెక్టుకు గండి పడటంతో పెద్ద మొత్తంలో నీరు వృద్ధాగాపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

సరళ సాగర్ ప్రాజెక్టుకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే అరుదైన ఆటోమెటిక్ సైఫన్ సిస్టమ్ గల సరళసాగర్ ప్రాజెక్టు ఆసియా ఖండంలోనే మొదటిది కాగా ప్రపంచంలో రెండవది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి వనపర్తి సంస్థానాధీశుల కాలంలో 1957లోనే పునాది పడింది. అప్పట్లోనే దీని నిర్మాణానికి 35 లక్షల రూపాయలను ఖర్చు చేశారు. 2009 భారీ వరదల సమయంలో నిండడంతో సరళసాగర్ ప్రాజెక్టు సైఫన్లు తెరచుకున్నాయి. మళ్లీ పదేళ్ల తర్వాత ఇటీవల కృష్ణాజలాలతో ప్రాజెక్టు నిండటంతో గేటు తెరుచుకున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories