Warangal Urban Collector Coronavirus Positive: వరంగల్ అర్బన్ కలెక్టర్ కు కరోనా పాజిటివ్

Warangal Urban Collector Coronavirus Positive: వరంగల్ అర్బన్ కలెక్టర్ కు కరోనా పాజిటివ్
x
coronavirus (File Photo)
Highlights

Warangal Urban Collector Coronavirus Positive: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కరోనా...

Warangal Urban Collector Coronavirus Positive: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ కరోనా పాజిటివ్ కేసులు అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా అటు హైదరాబాద్ నగరం పాజిటివ్ కేసుల నమోదులో ముందంజలో ఉంటే ఇటు వరంగల్ అర్బన్‌ జిల్లా రెండో స్ధానంలో నిలుస్తుంది. ఇప్పటికే వరంగల్ నగరానికి చెందిన పలువురు అధికార, ప్రతిపక్ష నాయకులు కరోనా బారిన పడ్డారు. ఇటీవలే మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. వరంగల్ బీజేపీ కీలక నేత సైతం కరోనా బారిన పడ్డారు. అంతే కాక నిన్నటికి నిన్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ దగ్గర పని చేసే సిబ్బంది కూడా ఈ కరోనా మహమ్మారి బారిన పడడంతో అధికారులు వారిని ఐసోలేషన్ కు తరలించారు.

ఇక తాజాగా వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుకు కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో ఆయన మెరుగైన వైద్యం తీసుకోవడానికి జులై 24 నుంచి ఆగష్టు 7 వరకు ఆయన సెలవు పెట్టారు. ఆగష్టు 8వ తేదీన సెలవు కావడంతో ఆయన తిరిగి ఆగష్టు 9న విధుల్లో చేరతారని సమాచారం. అప్పటి వరకు ఆయన చేపట్టవలసిన బాధ్యతలను వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ హరిత ఇంఛార్జి కలెక్టర్‌గా చేపడతారు. ఇప్పటికే ప్రభుత్వం దీనికి సంబంధఇంచి పూర్తి కసరత్తును చేసింది.

ఇక పోతే సోమవారం వరంగల్ అర్బన్ జిల్లాలో 152 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లాలో 25 కేసులు, భూపాలపల్లిలో 20, జనగామలో 18, మహబూబాబాద్ జిల్లాలో 14 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇటు హైదరాబాద్‌లో అత్యధికంగా 531 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 172 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య పరంగా ఈ రెండు జిల్లాల తర్వాత వరంగల్ అర్బన్ ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories