
బాల పురస్కారాల ప్రకటన.. అవార్డ్ అందుకున్న కూచిపూడి నర్తకి లక్ష్మిప్రియ
Bal Puraskar Award 2024: బాల పురస్కారం రావడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన లక్ష్మిప్రియ
Bal Puraskar Award 2024: Bal Puraskar Award 2024: రాష్ట్రీయ బాల పురస్కారాలకు వరంగల్‌కు చెందిన కూచిపూడి కళాకారిణి పెండ్యాల లక్ష్మిప్రియ ఎంపికయ్యింది. రాష్ట్రపతి చేతుల మీదుగా రాష్ట్రీయ బాల పురస్కారం అందుకున్నారు. ప్రస్తుతం కాజీపేట మాంట్ ఫర్డ్ స్కూల్ లో 10 తరగతి చదువుతున్న లక్ష్మీ ప్రియ... రిపబ్లిక్ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీని కలవడం సంతోషాన్నిచ్చిందన్నారు. రేపు బాల పురస్కార అవార్డు గ్రహితలతో కలిసి రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొననున్నారు. భవిష్యత్‌లో తన కళను మరింత ముందు తీసుకువెళ్లేందుకు అవకాశం కల్పించాలని ప్రధానిని కోరినట్టు.. లక్ష్మీ ప్రియ వివరించారు. హిందు సంప్రదాయాన్ని, కళలను సనాతన ధర్మాన్నీ మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు కృషిచేస్తానని ప్రధానికి తెలిపినట్టు లక్ష్మీ ప్రియ తెలిపారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




