గిరిజన మహిళ బ్యాంకు ఖాతా నుండి డబ్బు కాజేసిన విఆర్ఓ

గిరిజన మహిళ బ్యాంకు ఖాతా నుండి డబ్బు కాజేసిన విఆర్ఓ
x
Highlights

చెన్నాపురం గ్రామానికి చెందిన గాలి చంద్రమ్మ అనే మహిళ బ్యాంక్ ఖాతా నుండి పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు గ్రామనికి చెందిన రమేష్ (రెవెన్యూ ఉద్యోగి) అనే వ్యక్తి 6,50,000 రూపాయలు కాజేశాడు.

అశ్వారావుపేట: చెన్నాపురం గ్రామానికి చెందిన గాలి చంద్రమ్మ అనే మహిళ బ్యాంక్ ఖాతా నుండి పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు గ్రామనికి చెందిన రమేష్ (రెవెన్యూ ఉద్యోగి) అనే వ్యక్తి 6,50,000 రూపాయలు కాజేశాడు. చంద్రమ్మకు పశ్చిమగోదావరి జిల్లా వేలేరుపాడులో ఏడు ఎకరాల భూమి ఉంది. ఈ భూమి పోలవరం ముంపులో ఉండటంతో 33 లక్షలు పరిహారం సొమ్ము వచ్చింది. ఈ పరిహారం వ్యవహారంలో వేలేరుపాడు వి ఆర్ ఏ గా చేస్తున్న రమేష్ అనే వ్యక్తి అన్ని తానే అయ్యి పరిహారం జమ చేయించేందుకు కొంత సొమ్ము ఇవ్వాలని మొదట 3,50,000 తీసుకున్నాడు. ఇంతవరకు బానే ఉంది కాని తర్వాత అకౌంట్ లో సొమ్ము ఉండటం తెలిసిన రమేష్ చంద్రమ్మకు కుటుంబ సభ్యులకు తెలియకుండా అకౌంట్ నుండి 6,50,000 డ్రా చేసాడని బాధితుల ప్రధాన ఆరోపణ.

విషయం తెలుసుకున్న బాధితురాలు కుటుంబ సభ్యులు సదరు ఉద్యోగిని నిలదీయగా అన్ని నేనే దగ్గరవుండి చేశానని పని చేసిన తరువాత ఒక ఎకరం ఇస్తాను అన్నారని, కానీ ఇవ్వకపోవడంతో అకౌంట్ లో ఉన్న 6,50,000 డ్రా చేశానని ఒప్పందం ప్రకారమే ఈ తతంగం అంత జరిగిందని, పై అధికారులకు అందరకీ ఇచ్చుకుంటు వచ్చానని నేనేమి తినలేదని తన మాటలోనే రమేష్ చెప్పడం గమనార్హం. భాదితురాలు, కుటుంబ సభ్యులు మాత్రం మా దగ్గర పని చేశానని చెప్పి ముందుగానే 3,50,000 తీసుకున్నాడని, తరువాత మాకు తెలియకుండా 6,50,000 డ్రా చేశాడని లబోదిబోమన్నారు. మాకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories