Viral News: ప్రేమ పెళ్లితో ఒకటైన ఇద్దరు డాక్టర్లు..మధ్యలో ఇన్‌ఫ్లుయెన్సర్ రాక..పాపం ఆత్మహత్య చేసుకున్న వైద్యురాలు

Viral News
x

Viral News: ప్రేమ పెళ్లితో ఒకటైన ఇద్దరు డాక్టర్లు..మధ్యలో ఇన్‌ఫ్లుయెన్సర్ రాక..పాపం ఆత్మహత్య చేసుకున్న వైద్యురాలు

Highlights

Viral News: తెలంగాణలోని వరంగంల్‌లో మహిళా డాక్టర్ చనిపోవడం సంచలనంగా మారింది. నగరంలో ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో గుండె డాక్టర్‌‌గా సృజన్, మరో ఆసుపత్రిలో డెంటిస్ట్‌గా ప్రత్యూష పనిచేస్తున్నారు.

Viral News: ఒకప్పుడు భార్యభర్తల మధ్యలోకి ఎవరు వచ్చినా వాళ్ల పని ఔట్ అనేవారు. కానీ ఇప్పుడు మధ్యలోకి ఎవరు వస్తే వాళ్లతో వెళ్లిపోవడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా ఇద్దరు డాక్టర్లు ఒకరికొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు ఇద్దరూ హ్యాపీగానే ఉన్నారు. అయితే మధ్యలోకి ఇంటర్వ్యూ పేరుతో ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ రావడంతో తన భర్త అటువైపు తిరిగిపోయాడు. ఎంత చెప్పిన తన భర్త వినకపోవడంతో పాపం వైద్యురాలు ఆత్మ హత్య చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం..

తెలంగాణలోని వరంగంల్‌లో మహిళా డాక్టర్ చనిపోవడం సంచలనంగా మారింది. నగరంలో ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో గుండె డాక్టర్‌‌గా సృజన్, మరో ఆసుపత్రిలో డెంటిస్ట్‌గా ప్రత్యూష పనిచేస్తున్నారు. వీరిది ప్రేమ వివాహం. అయితే కొన్నాళ్ల క్రిందట ఇన్ స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ పాపులారిటీ సంపాదించుకున్న ఓ యువతి వీరి మధ్యలోకి ఎంట్రీ అయింది. ఆమోతో సృజన్ ప్రేమలో ఉన్నాడని, ఎన్ని సార్లు చెప్పినా వినడం లేదని, చివరకు తన కూతురు ఆత్మ హత్య చేసుకుందని ప్రత్యూష తల్లిదండ్రులు పోలీసులకు చెప్పారు.

సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ పాపులర్ అయిన ఒక అమ్మాయి.. డాక్టర్ సృజన్‌ని ఇంటర్వ్యూ చేసింది. వాటిని రీల్స్‌గా ప్రమోట్ చేసింది. ఈ క్రమంలో సృజన్, ఆ ఇన్ ఫ్లుయెన్సర్ మధ్య స్నేహం ప్రేమగా మారిందని ప్రత్యూష సృజన్‌తో తరచూ గొడవపెట్టుకునేది. చాలాసార్లు ఇద్దరి మధ్య వస్తున్న గొడవలను సర్ది చెప్పారు. కానీ సృజన్‌లో మార్పు రాకపోవడంతో తన కూతురు ఆత్మహత్య చేసుకుందని ప్రత్యూష తండ్రి పోలీసుల విచారణలో చెప్పాడు. తమ బిడ్డ చావుకు కారణం అయిన ఆ ఇద్దరినీ కఠినంగా శిక్షించమని కోరారు.

ప్రత్యూష మరణం వరంగల్‌లో కలకలం రేపింది. పెద్ద హోదాలో ఉన్న ఒక డాక్టర్ ఇలాంటి పనిచేసింది ఏంటని అందరూ ఆశ్చర్యపోయారు. కార్డియాలజిస్ట్ సృజన్‌ను పోలీసులు విచారణ చేస్తున్నారు. అన్ని కోణాల్లోనూ పోలీసులు కేసును ధర్యాప్తు చేస్తున్నారు. హత్యా లేక ఆత్మ హత్యా అనే కోణంలో కూడా దీన్ని చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories