ఖమ్మం జిల్లాలో విషజ్వరాల విజృంభణ

Viral Fever, Dengue in Khammam District
x

ఖమ్మం జిల్లాలో విషజ్వరాల విజృంభణ

Highlights

Khammam: పేషంట్లతో కిక్కిరిసిపోతున్న ఆసుపత్రులు

Khammam: ఎడతెరిపి లేకుండా కురుసిన భారీ వర్షాలు గ్రామాల్లో చిత్తడి చేశాయి. వాతవరణంలో మార్పులతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. పట్టణం., పల్లె అనే తేడా లేకుండా డేంగీ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలు ప్రభలుతున్నాయి. సీజనల్ వ్యాధులకు గురయ్యారు. ఆసుపత్రులన్నీ పేషంట్లతో కిక్కిరిసిపోతున్నాయి.

కరోనా పీడ విరగడయ్యిందనుకుంటున్న తరుణంలో విషజ్వరాల విజృంభణ ప్రజలను కలవరపరుస్తుంది. ఇటీవలి కాలంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలతో వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజలు డేంగీ, మలేరియా, టైఫాయిడ్ ఇతర వ్యాధుల భారీన పడుతున్నారు. జిల్లాలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో బాధితులు పెరుగుతున్నారు. ఒక్కో బెడ్ పై ఇద్దరు రోగులను పడుకో బెట్టి వైద్యచికిత్సలు చేయాల్సిన పరిస్తితి నెలకొన్నది. సరిపడు మంచాల్లేక బెంచీలపై పడుకోబెట్టి ట్రీట్ మెంట్ చేస్తున్నారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కాలనీల్లో నీళ్లు నిలిచిపోయి. డ్రైనేజీలు నిండిపోవడం ఓపెన్ ప్లాట్లన్ని మురికి కుంటల్లా మారాయి. దీంతో దోమలు వృద్ది చెంది డేంగీ, మలేరియా ఇతర విషజ్వరాలు ప్రబలుతున్నాయని సమీప ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోని పారిశుధ్యాన్ని మెరుగుపర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నిల్వ ఉన్న వర్షం నీటిని తొలగించే ప్రయత్నం చేయాలన్నారు. వాతావరణంలో వచ్చిన మార్పులతో ప్రజలు రోగాల భారీన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. మరో వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం దొరక్క ప్రైవేట్ ఆలసుపత్రులను ఆశ్రయించాల్సిన వస్తుందని ప్రజలు వాపోతున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో టెస్టుల పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories