Village Lockdown: కరోనా వైరస్‌ కట్టడిలో పల్లెలు ముందడుగు

Villages Are Self  Lockdown For Corona Control
x
సెల్ఫ్ లాక్ డౌన్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Village Lockdown: కరోనా వైరస్‌ తమ దరిచేరొద్దంటూ చాలా గ్రామాలు స్వచ్ఛందంగా నిర్బంధం విధించుకుంటున్నాయి

Village Lockdown: కరోనా వైరస్‌ కట్టడికి పల్లెలు ముందడుగు వేశాయి. కరోనా వైరస్‌ తమ దరిచేరొద్దంటూ చాలా గ్రామాలు స్వచ్ఛందంగా నిర్బంధం విధించుకుంటున్నాయి. జనం కూడా అండగా నిలుస్తుండటంతో అనేక పల్లెలు స్వచ్ఛందంగా దిగ్బంధనం చేసుకున్నాయి. కరోనా లక్షణాలున్న వారికి క్వారంటైన్‌ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. మాస్క్‌లు ధరించాలని.. భౌతికదూరం పాటించాలని తీర్మానించుకున్నాయి.

కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో తెలంగాణ జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ విధించుకున్నారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో లాక్‌డౌన్ పాటించాలని పంచాయతీ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. ఈనెల 3 నుంచి మల్లాపూర్ మండలంలోని సిరిపూర్‌లో ప్రజలు లాక్‌డౌన్ పాటిస్తున్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించాలని తీర్మానించారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండలో ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటిస్తున్నారు. ఇ టీవల గ్రామంలో ఓ వ్యక్తి కరోనాతో చనిపోగా అంత్యక్రియల అనంతరం ఆ కుటుంబానికి చెందిన వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో అప్రమత్తమయ్యారు గ్రామస్తులు. మంగళవారం నుంచి స్వయంప్రకటిత లాక్‌డౌన్ విధించుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories