Khammam: కుక్కల దాడి నుంచి దుప్పి పిల్లను కాపాడిన కాలనీ వాసులు

Village People Rescue Deer Cub From Dogs
x

కుక్కల దాడి నుంచి దుప్పి పిల్లను కాపాడిన కాలనీ వాసులు

Highlights

Khammam: అర్బన్ పార్క్ నుంచి బయటకు వచ్చిన దుప్పి పిల్ల

Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జలగం నగర్ కాలనీ వద్ద కుక్కల దాడి నుండి ఓ దుప్పి పిల్లను కాపాడి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు కాలనీవాసులు. కాలనీకి సమీపంలోని అర్బన్ పార్క్ నుండి దుప్పి పిల్ల బయటకు రావడంతో కుక్కలు దాడి చేయడం గమనించిన కాలనీవాసులు దుప్పి పిల్లను కాపాడి ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న సత్తుపల్లి ఫారెస్ట్ అధికారులు దుప్పి పిల్లను స్వాధీనం చేసుకుని ప్రాథమిక చికిత్సకు తరలించారు.

ఇటీవల వరుసగా అర్బన్ పార్క్ నుండి దుప్పి పిల్లలు జనావాసాల్లోకి వస్తూ ప్రమాదాల బారిన పడుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే రెండు దుప్పి పిల్లలు పార్క్ నుంచి బయటకు వచ్చి కాకర్లపల్లి గ్రామ సమీపంలో సంచరిస్తూ కుక్కల దాడిలో గాయపడటంతో గ్రామస్తులు వాటిని రక్షించి ఫారెస్ట్ అధికారులకు అప్పగించారు. అర్బన్ పార్క్ చుట్టూ సరైన రక్షణ వలయం ఏర్పాటు చేసి జంతువులు బయటకు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories