ఆ సానుభూతి టీఆర్‌ఎస్‌కు ఎందుకు లభించలేదో చెప్పాలి -విజయశాంతి

ఆ సానుభూతి టీఆర్‌ఎస్‌కు ఎందుకు లభించలేదో చెప్పాలి -విజయశాంతి
x
Highlights

* సీఎం కేసీఆర్‌పై విజయశాంతి విమర్శనాస్త్రాలు * కేసీఆర్‌ సర్వేలన్నీ అవకతవకలే -విజయశాంతి * దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలుపు ఖాయమన్నారు * ఫలితం మాత్రం వేరేగా వచ్చింది -విజయశాంతి * సానుభూతి తప్ప దుబ్బాక ఫలితం మరొకటి కాదన్నారు- విజయశాంతి

సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్‌ సీనియర్ నాయకురాలు విజయశాంతి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. జీహెచ్‌ఎంసీలో గెలుపు తమదేనంటున్న సీఎం కేసీఆర్‌ సర్వేలన్నీ అవకతవకలేనని ఆమె అన్నారు. దుబ్బాక ఎన్నిక ముందు కూడా కేసీఆర్ అదే చెప్పారని.. కానీ.. ఫలితం మాత్రం వేరేగా వచ్చిందన్నారు. సానుభూతి తప్ప దుబ్బాక ఫలితం మరొకటి కాదంటున్న కేసీఆర్.. ఆ సానుభూతి తమ పార్టీకి ఎందుకు లభించలేదో చెప్పాలన్నారు. ఎంఐఎం ఒత్తిడికి తలొగ్గే జీహెచ్‌ఎంసీ ఎన్నికలు తొందరగా నిర్వహిస్తున్నారని విమర్శించారు విజయశాంతి. బీజేపీలోకి చేరతారన్న ప్రచారం నేపథ్యంలో అటు కేసీఆర్, ఇటు మజ్లిస్‌పై పదునైన విమర్శలు సంధిస్తున్నారు విజయశాంతి.

Show Full Article
Print Article
Next Story
More Stories