టీఆర్ఎస్ సీపీఐ కలిసిన పోటీ చేసినా కాంగ్రెస్ గెలుస్తుంది : వీహెచ్

టీఆర్ఎస్ సీపీఐ కలిసిన పోటీ చేసినా కాంగ్రెస్ గెలుస్తుంది : వీహెచ్
x
Highlights

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో టీఆర్ఎస్, సీపీఐ మైత్రిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ నిరంకుశ పాలనపై నిరంతరం పోరాడిన సీపీఐ చివరికి ఆదే పార్టీకి మద్దతు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో టీఆర్ఎస్, సీపీఐ మైత్రిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ విమర్శల వర్షం కురిపించారు. కేసీఆర్ నిరంకుశ పాలనపై నిరంతరం పోరాడిన సీపీఐ చివరికి ఆదే పార్టీకి మద్దతు ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సీపీఐ నాయకులు కళ్లు తెరవాలన్నారు. సీపీఐ కాంగ్రెస్‎కు మద్దతు ఇవ్వాలని 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌,సీపీఐ కలిసి పోటీ చేశాయని వీహెచ్ గుర్తు చేశారు. ఓడిపోతామన్న భయం కేసీఆర్ కు పట్టుకుందని అందుకే సీపీఐ మద్దతు తీసుకున్నారని విమర్శించారు. సీపీఐ జాతీయ స్థాయి నేతలతో తాను మాట్లాడానని తెలిపారు. సీపీఐ టీఆర్ఎస్ కలిసి పోటీ చేసిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని వీహెచ్ ఆశాభావం వ్యక్తం చేశారు.


అయితే హుజూర్‎నగర్ ఉపఎన్నికలో నామినేషన్లకు నేటితో తెరపడనుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమణి పద్మావతి బరిలో ఉన్నారు. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి సైదిరెడ్డి, బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుంచి చావా కిరణ్మయి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే

Show Full Article
Print Article
More On
Next Story
More Stories