Venkaiah Naidu: ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Venkaiah Naidu Visited Ganapati In Khairatabad Hyderabad
x

Venkaiah Naidu: ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Highlights

Venkaiah Naidu: ప్రజలందరూ సుఖ, సంతోషంగా ఉండాలని గణపతిని ప్రార్ధించా

Venkaiah Naidu: దైవ, దేశ, గురు భక్తి ముఖ్యమని, ప్రతి ఒక్కరికీ దైవభక్తితో సంతృప్తి కలుగుతుందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఖైరతాబాద్ మహా గణపతిని దర్శించుకున్న సందర్భంగా మాజీ ఉప రాష్ట్రపతి మాట్లాడారు. దేశంలో సమైక్యత, గురుభావం, ధైవభక్తి పెరుగుతోందన్నారాయన... దేశం శక్తివంతంగా తయారవుతుందని, ఇలానే దేశం ముందుకు వెళ్లాలని కోరుకొంటున్నానని అన్నారు. కుటుంబ సమేతంగా బడా గణేష్‌ను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి మహాగణపతిని దర్శించుకుంటున్నానని తెలిపారు వెంకయ్య నాయుడు... ప్రజలందరూ సుఖ, సంతోషంగా ఉండాలని గణపతిని ప్రార్ధించానని తెలిపారాయన.

Show Full Article
Print Article
Next Story
More Stories