Bhadradri: భద్రాద్రి రామాలయంలో వెండి ద్వారం ఏర్పాటు

Vendi Vakili Ready In Bhadrachalam Temple
x

Bhadradri: భద్రాద్రి రామాలయంలో వెండి ద్వారం ఏర్పాటు

Highlights

Bhadradri: 103 కేజీల వెండితో తయారు చేసిన ద్వారం

Bhadradri: దక్షిణ అయోధ్యగా విరజిల్లుతున్న భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో వెండి వాకిలితో అంతరాలయ ప్రవేశ ద్వారాన్ని సిద్ధం చేశారు. ఈ ద్వారం భక్తులకు కనువిందు చేస్తోంది. ఇప్పటికే ధ్వజ స్తంభానికి ముందువైపు, పక్కవైపు ఇత్తడి తాపడంతో వెలుగొందితుండగా, గర్భాలయ ద్వారం స్వర్ణకాంతులతో విరజిల్లుతోంది..తాజాగా ఆలయంలో అంతరాలయ ప్రవేశద్వారం వెండి వాకిలితో సిద్ధమైంది.ఇలా మూడు లోహాల వాకిళ్ళతో భద్రాద్రి రామాలయం నవ్య శోభను సంతరించుకుంది.

103 కేజీల వెండితో తయారుచేసిన ఈ ద్వారంపై 'శ్రీరామ జయ రామ జయ జయ రామ' అని సువర్ణ అక్షరాలతో లిఖించారు. అలాగే దశావతారాలు, భక్త రామదాసు, పోకల దమ్మక్క భద్రాద్రి రామయ్య ను పూజిస్తున్న చిత్రాన్ని కూడా ఏర్పాటు చేశారు.ఈ అంతరాలయ ప్రవేశ ద్వారాన్ని చూసి భక్తులు మంత్రముగ్దులవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories