Top
logo

Telangana: పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డ ఉత్తరప్రదేశ్ వలస కూలీలు

Uttar Pradesh laborers committed thefts in various places
X

Representational Image

Highlights

Telangana: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామ శివారులో గుడారాలు వేసుకున్న కూలీలు

Telangana: సడన్‌గా యూపీ వలస కూలీల గూడారాలపై పోలీసులు విరుచుకపడ్డారు. వాళ్ల సామాన్లను చెల్లాచెదురుచేశారు. గూడారాలను నేలకూల్చారు. ఈ సీన్లను చూసిన స్థానికులు పోలీసులను తప్పు పట్టారు. బతుకుదెరువు కోసం వచ్చిన వారిపై పోలీసులు ప్రతాపం చూపిస్తున్నారంటూ తిట్టుకున్నారు. ఇక అసలు విషయం తెలుసుకున్నాక పోలీసులు చేసిన పనికి మెచ్చుకున్నారు.

చెల్లాచెదురైన సామాన్లను సదురుకుంటూ అమాయకంగా కనిపిస్తున్న వీళ్లు మాములు వ్యక్తులు కాదు. పక్కా స్కెచ్‌ వేసి, ఇళ్లను కొల్లగొడుతారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వలస కూలీలు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామ శివార్లలో గుడారాలు వేసుకున్నారు. సంచార జీవనం గడిపేవాళ్లని అందరు భావించారు. కానీ వీళ్లు పలు ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారని హైదరాబాద్ సీసీఎస్ పోలీసుల విచారణలో తేలింది. కొత్తపల్లికి వచ్చిన సీసీఎస్ స్పెషల్ టీం గుడారాలను తనిఖీ చేసింది. 3 లక్షల నగదు, ఇతర విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రైడ్‌తో అసలు విషయం తెలుసుకున్న స్థానికులు ముక్కున వేలేసుకున్నారు.

Web TitleTelangana: Uttar Pradesh laborers committed thefts in various places
Next Story