Congress: పీఈసీ మీటింగ్‌లో ఉత్తమ్ వర్సెస్ రేవంత్

Uttam Vs Revanth In PEC Meeting
x

Congress: పీఈసీ మీటింగ్‌లో ఉత్తమ్ వర్సెస్ రేవంత్

Highlights

Congress: ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమలు చేయాలని మరికొందరు సభ్యుల డిమాండ్

Congress: పీఈసీ మీటింగ్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. పార్టీలో రెండు టికెట్ల విషయంలో ఉత్తమ్, రేవంత్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వాలని తానే చెప్పానని.. రెండు టికెట్లు అంశం హైకమాండ్ చూసుకుంటుందని రేవంత్ రెడ్డి అన్నారు. పీసీసీ ప్రెసిడెంట్‌గా హైకమాండ్‌కు చెప్పాలని రేవంత్‌కు ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. తనను డిక్టేట్ చేయవద్దని రేవంత్ రెడ్డి చెప్పడంతో... ఉత్తమ్ కుమర్ రెడ్డి సీరియస్‌గా వెళ్లిపోయారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ అమలు చేయాలని మరికొందరు సభ్యులు డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories