
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన సతీమణి నల్లమాడ పద్మావతిరెడ్డి పోటీ చేస్తారని...
సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన సతీమణి నల్లమాడ పద్మావతిరెడ్డి పోటీ చేస్తారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. శనివారం హుజూర్‌నగర్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ విహయంపై స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని కార్యకర్తల అభిప్రాయం మేరకే పద్మావతిని అభ్యర్థిగా అధిష్టానం ఫైనల్ చేసిందని చెప్పారు. ఇదిలావుంటే అసెంబ్లీ హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా గెలిచారు ఉత్తమ్.. అయితే ఆ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా ఉత్తమ్ గెలవడంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్‌తో పాటు అధికార టీఆర్‌ఎస్ కూడా హుజూర్‌నగర్ స్థానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



