Uttam Kumar Reddy: పేదలకు బియ్యం సరఫరా పారదర్శకంగా ఉండాలి

Uttam Kumar Reddy Review on Civil Supplies Department
x

Uttam Kumar Reddy: పేదలకు బియ్యం సరఫరా పారదర్శకంగా ఉండాలి

Highlights

Uttam Kumar Reddy: 1.8 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రజలకు ఉచితంగా ఇస్తున్నాం

Uttam Kumar Reddy: పేద ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న బియ్యం సరఫరా విషయంలో మనం మరింత పారదర్శకంగా ఉండాలన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సివిల్ సప్లై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. ప్రజలు రేషన్ బియ్యాన్ని ఉపయోగించుకుంటున్నారా అనేది గమనించాలన్నారు. కిలో 39 రూపాయలు పెట్టి సేకరిస్తున్న బియ్యాన్ని... పేదలు తినకపోతే పథకం నిరుపయోగం అవుతుందన్నారు. మొక్కుబడిగా కాకుండా లోపాలు ఎక్కడ ఉన్నాయో వెతకాలని.. పేదలకు ఉపయోగకరమైన పథకంగా ఎలా మార్చాలో అధ్యయనం చేయాలని సూచించారు.

పేదలకు ఇస్తున్న బియ్యం వారు తినే విధంగా ఉండాలి తప్ప దుర్వినియోగం కావొద్దన్నారు ఉత్తమ్. రైస్ మిల్లర్ల నుంచి బియ్యం సేకరణలో జాప్యం ఎందుకు జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు మంత్రి. రాష్ట్రంలో రైతుల నుంచి సివిల్ సప్లై శాఖ ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యం వివరాలను కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories