Uttam Kumar: రేవంత్‌, ఠాగూర్‌పై కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటు

*టికెట్‌ ఇచ్చిన పార్టీని, నేతలను విమర్శించడం సరికాదు *కౌశిక్‌రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేశాం

Sandeep Reddy
Updated on: 12 July 2021 8:46 PM IST
Uttam Kumar Reddy Fires on Koushik Reddy Comments About Revanth Reddy And Tagore
X

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (ఫైల్ ఫోటో)

Uttam Kumar Reddy: కౌశిక్‌రెడ్డి తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని అన్నారు మాజీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. రేవంత్‌రెడ్డి‌, మాణిక్కం ఠాగూర్‌పై కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఉత్తమ్‌ 2018లో హుజూరాబాద్‌ టికెట్‌ రావడంతోనే కౌశిక్‌రెడ్డి లీటర్‌ అయ్యారని గుర్తుచేశారు. టికెట్‌ ఇచ్చిన పార్టీని, నాయకులను విమర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు. కౌశిక్‌రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరించామని, నాయకులు ఎవరైనా సరే వారి స్థాయిని తెలుసుకొని మాట్లాడాలని సూచించారు ఉత్తమ్‌.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story