Telangana: ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న గులాబీ బాస్

Upcoming Elections in Telangana | TS News
x

 Telangana: ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్న గులాబీ బాస్

Highlights

Telangana: సంక్షేమ పథకాలకు నిధులు లేక ఇబ్బందులు..!

Telangana: ఓ వైపు బీజేపీ దూకుడు పెంచకముందే ఎన్నికలకు వెళ్లాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారు. రెండుసార్లు అధికారంలో ఉండటంతో సహజంగానే ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడా వ్యతిరేకత టీఆర్ఎస్‌పై కూడా మొదలయ్యిందనేది పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న చర్చ. రెండుసార్లు అధికారంలో ఉండటంతో ఎమ్మెల్యేల వ్యవహారశైలి, పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇక పార్టీ పరిస్థితి ఇలా ఉంటే ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. దీంతో ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. సంక్షేమ పథకాలకు నిధులు లేక ఇబ్బందులు పడుతోంది.

ఇది ఇలా కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి గడ్డు పరిస్థితులు తప్పవని భావిస్తున్న కేసీఆర్ ముందస్తుకే సై అంటున్నారన్న చర్చ జరుగుతోంది. సాధారణంగా వచ్చే ఏడాది నవంబర్, డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ సీఎం కేసీఆర్ మాత్రం ఏప్రిల్ లో కర్ణాటక ఎన్నికలతోనే వెళ్లేందుకు ప్రిపేర్ అవుతున్నారట. అందుకోసం పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అటు కేటీఆర్ ఇటు హరీష్ రావును అభివృద్ధి కార్యక్రమాల పేరిట జిల్లాల్లో విస్తృత పర్యటనలు చేస్తున్నారన్న వాదనా వినిపిస్తోంది.

ఇప్పటికే తెలంగాణలో బీజేపీ స్పీడ్ పెంచింది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర స్థాయి కీలక నేతలను రంగంలోకి దింపి అధికారమే టార్గెట్ గా గ్రౌండ్ ప్రిపేర్ చేయిస్తోంది ఆ పార్టీ అగ్ర నాయకత్వం. తాజాగా ఎన్నడూ లేని విధంగా ప్రధాని మంత్రి మోడీ బీజేపీ కార్పొరేటర్లను ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడటం బీజేపీ తెలంగాణపై ఎంత ఫోకస్ పెట్టిందనటానికి నిదర్శనం. ఇక బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైద్రాబాద్ లో నిర్వహించటం తెలంగాణలో కేసీఆర్ ముందస్తు వెళతారనే క్లారిటీ బీజేపీకి ఉందన్న చర్చ జరుగుతోంది. ఇక ఇక లోక్ సభ, శాసనసభ ఎన్నికలు ఒకేసారి వస్తే అసలుకే మోసం వస్తుందని భావిస్తోన్న గులాబీ బాస్.. ముందస్తుకు వెళ్తేనే బెటర్ అన్న ఆలోచనతో ఉన్నారట. ఈలోగా రైతుబంధు నిధులు పంపిణీ చేసి రైతు ఎజెండాతోనే ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories